Advertisement
పెళ్లి అంటేనే నూరేళ్ల పంట అంటారు మన పెద్దలు. నిండు నూరేళ్లు వారు కలకాలం జీవించాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కొత్తగా పెళ్లి అయిన వారు మొదట కొన్నాళ్లు ఓ కలల ప్రపంచం లో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత చిన్నగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడుతాయి. దీనికి కారణం ఒకరిపైన ఇంకొకరికి అవగాహన తగ్గటం, అర్థం చేసుకోకపోవడమే. వివాహమైన తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ జంట జీవితాంతం హ్యాపీ గా ఉంటుంది.
Advertisement
READ ALSO : T20 WC 2022 : టీమిండియాను దారుణంగా అవమానించిన గిన్నిస్ రికార్డ్స్
అయితే ఓ యువతి చనిపోయిన తన అక్క బిడ్డల బాగు కోసం బావని పెళ్లి చేసుకుంది. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి బావతో మూడు ముళ్ళు వేయించుకుంది. వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ లోని కుంచనపల్లికి చెందిన ఓ మహిళ కోవిడ్ సెకండ్ వేవ్ టైం లో మృత్యువాత పడింది. ఇక అప్పటి నుంచి ఆమె బిడ్డలు తల్లి లేని లోటును అనుభవిస్తూ ఉన్నారు. ఆడ తోడు లేని కుటుంబం కావడంతో పిల్లలతో సహా బావ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ముఖ్యంగా ఆ పిల్లలు తల్లి ఎక్కడికి పోయిందని తండ్రిని అడిగితే ఏమి చెప్పలేకపోయేవాడు.
Advertisement
అయితే, దేవుడు ఒకటి తీసుకుపోతే మరొకటి ఇస్తాడు అంటారు. ఆ పిల్లల విషయంలోనూ అదే జరిగింది. తల్లిని తీసుకుపోయిన దేవుడు పిన్ని రూపంలో మరో తల్లిని వారికి జత చేశాడు. అక్క పోయిన తర్వాత ఆ పిల్లలు పడుతున్న బాధను చూసి వారి పిన్ని చలించిపోయింది. ఎలాగైనా వారిని అన్ని తానై చూసుకోవాలని అనుకుంది. ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. అయితే, వారు ఇందుకు ఒప్పుకోలేదు. అయినా ఆమె వెనక్కు తగ్గలేదు. బావకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అతడు వద్దని వారించాడు. అయినా ఆమె వినలేదు. తన అక్క బిడ్డల్ని చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని తేల్చి చెప్పింది. అయితే ఆ యువతి చేసిన పనికి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కార్తీకమాసంలో ఇలా చేస్తే ఎన్నో జన్మల పాపాలు పోతాయి..!