Advertisement
డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటుంటారు. హీరో ఎవరనేది కొంతవరకు హైప్ చేయగలదు కానీ రిలీజయ్యాక సినిమా కథ బాగుంటేనే, ఎమోషన్స్ ఎలివేషన్స్,కామెడీ ఎలిమెంట్స్ బాగుంటేనే సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుంది. స్టోరీస్ సెలక్షన్ హీరోని చూజ్ చేసుకోవడం నుంచి మూవీకి సంబంధించి అన్ని టెక్నికల్ ఫిల్డ్స్ లో పట్టు ఉండాలి. అందుకే సినిమాకి డైరెక్టర్ నే మెయిన్ గా చూస్తారు. మరి అలాంటి డైరెక్టర్లు కంటిన్యూస్ గా హిట్లు ఇస్తూ ఆడియన్స్ ను అలరించడం అంటే మామూలు విషయం కాదు. అయితే సినిమా ఏదైనా కారణం వల్ల ఆ ఫ్లాఫ్ అయితే మాత్రం దర్శకులపై నెగిటివ్ కామెంట్లు వినిపిస్తాయి. హీరోలు కథలో వేలు పెట్టడం వల్లే సినిమాలు ఫ్లాఫ్ అవుతున్నాయని పలు సందర్భాల్లో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఆ సందర్భాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
దర్శకుడు వి వి.వినాయక్ ఆది సినిమా నుంచి ఖైదీ నెంబర్ 150 సినిమా వరకు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. సక్సెస్ రేట్ ఎంతో ఎక్కువగా ఉన్న దర్శకులలో వినాయక్ ఒకరు. అయితే అఖిల్, ఇంటెలిజెంట్ సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల వినాయక్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. టాలీవుడ్ స్టార్ హీరోలు వినాయక్ తో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఛత్రపతి రీమేక్ తో సక్సెస్ సాధిస్తే మాత్రమే టాలీవుడ్ హీరోలు వినాయక్ ని నమ్మే ఛాన్స్ ఉంది.
Advertisement
మరో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ తొలినాళ్లలో తెరకెక్కించిన సినిమాలు ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలుసు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, శివమణి, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, చిరుత, దేశముదురు, బిజినెస్ మెన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో పూరి సక్సెస్ లను అందుకున్నారు. అయితే లైగర్ ప్లాప్ వల్ల పూరి జగన్నాథ్ పనిచేయడానికి హీరోలు ఆసక్తి చూపడం లేదు. లైగర్ ప్లాప్ విషయంలో ఎక్కువమంది పూరి జగన్నాథ్ ను నిందించారు.
ఆచార్య మూవీ ఫ్లాప్ విషయంలో కూడా అన్ని వేళ్లు కొరటాల శివ వైపు చూపిస్తున్నాయి. ఒకటి, రెండు సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల పూరీ జగన్నాథ్, వినాయక్, కొరటాల శివలపై పడిన నిందలు అన్ని ఇన్ని కావు. తర్వాత సినిమాలతో దర్శకులు ఈ మరకలను చెరిపేయాల్సి ఉంది. ఈ టాలీవుడ్ దర్శకుడు తర్వాత ప్రాజెక్టులతో అయినా సక్సెస్ లను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. పూరి, వినాయక్, కొరటాల శివలను చూసి సినిమాలు ఫ్లాప్ కాకుండా జాగ్రత్తలు తీసుకునే విషయంలో దర్శకులు మారాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.