Advertisement
టాలీవుడ్ నటుడు నరేష్ గతంలో హీరోగా నటించిన అనేక హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక హీరోగా అవకాశాలు తగ్గాక కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తండ్రి అలాగే మామ పాత్రలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు నరేష్. అయితే వృత్తిపరంగా నరేష్ కెరీర్ బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయన ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. ఇటీవలే ఆయన మాజీ భార్య రమ్య రఘుపతి కారణంగా ఆయన వార్తల్లోకి ఎక్కారు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురితో విభేదాల కారణంగా విడిపోయి నరేష్ తాజాగా ఇప్పుడు నటి పవిత్ర లోకేష్ తో సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం మొదలైంది.
Advertisement
ఇప్పుడే కాదు దాదాపు పదిహేను రోజుల పై నుంచే ఈ వ్యవహారం మీద వార్తలు బయటకు వస్తున్నాయి. దానికి ఊతమిస్తున్నాయి ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి మీడియా కంట పడుతున్నారు. ఈ జంట పలు సినిమాల్లో భార్యాభర్తలుగా నటించారు. అలా ఏర్పడినప్పుడు పరిచయమే ప్రేమకు దారి తీసిందని వాదన వినిపిస్తోంది.
Advertisement
అయితే సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నదే ఈ విషయం నిజం కాకుండా ఇప్పటికే స్పందించి ఉండేవారని మరికొందరు వాదన వినిపిస్తున్నారు. దానికి తోడు ఇటీవలే వీరిద్దరూ కలిసి మహాబలేశ్వరం లోని ఒక గుడిలో దర్శనం ఇవ్వడం కూడా ఈ పెళ్లి వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్లూ అయింది. తమ పెళ్లి గురించి ఒక స్వామీజీ తో మాట్లాడినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి చెబితే తప్ప అప్పటి వరకు ఈ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కాగా పవిత్ర ఇప్పటికే తన భర్త ప్రసాద్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
also read;