Advertisement
మన చలన చిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు, సహజీవనం అలాగే విడాకులు చాలా కామన్ అయిపోయాయి. చూడగానే.. ప్రేమ అంటూ పెళ్లి చేసుకుంటున్నారు. చిన్నచిన్న గొడవలకు విడిపోతున్నారు. అయితే కొందరు నటీనటులు మాత్రం దర్శకుడు కట్ చెప్పిన కూడా ఆ బంధాన్ని కొనసాగిస్తుంటారు. రీల్ లైఫ్ రిలేషన్ ను రియల్ లైఫ్ లోను కంటిన్యూ చేస్తుంటారు. కోలీవుడ్ కు చెందిన అలాంటి 10 జంటలను ఈ స్టోరీలో చూసేద్దాం.
Advertisement
# తమిళ్ అగ్ర నటుడు సూర్య, స్టార్ హీరోయిన్ జ్యోతిక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 2006లో వివాహం చేసుకున్న వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
# కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ హీరోయిన్ షాలిని ప్రేమ వివాహం చేసుకున్నారు. సినిమా స్టార్టింగ్ లో లవ్ లో పడి షూటింగ్ ఎండ్ లో పెళ్లి చేసుకున్నారు.
# విలక్షణ నటుడు ఆర్య నటి సయేషా కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. గజినీకాంత్ షూట్ సమయంలో లవ్ లో పడ్డారు. 2019లో పెళ్లి చేసుకున్నారు.
# టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గర అయిన హీరోయిన్ స్నేహ, తమిళ నటుడు ప్రసన్న లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 2012లో వీరిద్దరూ ఒకటయ్యారు.
Advertisement
# నటుడు గౌతమ్ కార్తీక్ నటి మంజీమా మోహన్ ఇద్దరూ 2019లో పెళ్లి చేసుకున్నారు. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు.
# స్టార్ హీరో శరత్ కుమార్ నటి రాధికను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి.
# అంతకుముందు రాధిక మరో తమిళ నటుడు ప్రతాప్ పోథేన్ వివాహం చేసుకున్నారు. శరత్ కుమార్ ఛాయాదేవిని పెళ్లి చేసుకున్నారు.
# నటుడు ప్రభు అలనాటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ కొంత కాలం రిలేషన్ కొనసాగించారు. ఆ తర్వాత 1993ల వివాహం చేసుకున్నారు. కానీ నాలుగు నెలల తర్వాత విడిపోయారు.
# సీనియర్ నటుడు దర్శకుడు పర్థిబాన్ నటి సీతను వివాహం చేసుకున్నారు. 1990లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 2001లో విడిపోయారు.
# విలన్ పాత్రలతో ప్రసిద్ధి చెందిన రఘువరన్ నటి రోహిణి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విభేదాలతో 2004లో విడిపోయారు.
Read also: సూపర్ స్టార్ నల్ల కళ్లద్దాల వెనుక అసలు స్టోరీ ఇదే !