Advertisement
దివంగత స్టార్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవికి తెలుగు నాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో శ్రీదేవి నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు స్టార్ హీరోలు అందరి సరసన హీరోయిన్ గా నటించింది శ్రీదేవి. ఇక ఏ ఇండస్ట్రీలో అయినా కొన్ని జంటలు ఎలాంటి సినిమా తీసినప్పటికీ సక్సెస్ అవుతూ ఉంటాయి. అలాంటి జంటలు మన టాలీవుడ్ లో చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. శ్రీదేవి మూడు తరాల టాప్ స్టార్స్ తో నటించింది. కానీ ఒక్క నందమూరి నటసింహం బాలయ్య బాబుతో మాత్రం జత కట్టలేదు.
Advertisement
Read also: ఎవరూ చేయని త్యాగం చేస్తున్న ఇంద్రజ భర్త.. అదేంటో తెలుసా..?
బాలకృష్ణ – శ్రీదేవి కాంబినేషన్ లో సినిమా ఎందుకు రాలేదు? అనే సందేహం అప్పటి వారికే కాదు, ఈతరం ప్రేక్షకాభిమానులకు కూడా వస్తుంది. అయితే దీని వెనక పెద్ద కారణమే ఉందంటూ ప్రచారం చాలా కాలంగా జరుగుతుంది. ఎన్టీఆర్ “బడిపంతులు” చిత్రంతో బాలనటిగా పరిచయమైంది శ్రీదేవి. ఆ తర్వాత 1970 లో 16 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక 1990 లలో స్టార్ హీరోయిన్ గా అవతరించింది. 1987లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలయ్య – శ్రీదేవి కాంబోలో ” సామ్రాట్” అనే సినిమా చేద్దామనుకున్నారట. కానీ బాలయ్య తండ్రి ఎన్టీఆర్ కి ఈ కాంబినేషన్ ఎందుకో అసలు నచ్చలేదట. ఆ తర్వాత ఈ చిత్రంలో విజయశాంతిని కథానాయికగా తీసుకున్నారు.
Advertisement
ఆ తర్వాత కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య – శ్రీదేవి కాంబోలో ఓ సినిమా అనుకుంటూ ఉండగా ఆ ప్రయత్నానికి నందమూరి అభిమానులు అడ్డు తగిలారు. తండ్రి ఎన్టీఆర్ తో పాటు కొడుకు బాలయ్య కూడా శ్రీదేవి పక్కన నటిస్తే బాగోదని ఏకంగా ఎన్టీఆర్ కే వెళ్లి చెప్పడంతో ఆయన ఈ కాంబోకి నో చెప్పారట. తన పక్కన జోడి కట్టిన శ్రీదేవితో నీవు సినిమాలు చేస్తే ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకోకపోవచ్చు అని, కాబట్టి శ్రీదేవితో రొమాన్స్ చేయొద్దని ఎన్టీఆర్ బాలయ్యను ఆదేశించారట. అందుకే బాలకృష్ణ శ్రీదేవితో సినిమాలు చేయలేదని టాక్. అలా బాలయ్య పక్కన మిస్సయిన రెండు సినిమాలలో విజయశాంతిని తీసుకున్నారు.
Also Read: ఇష్టమైన వారిని 10 నిమిషాలు కౌగిలించుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?