Advertisement
మనకు బాగా సంతోషం కలిగినప్పుడు, లేదా బాగా ఇష్టమైన వారిని చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు వారిని కౌగిలించుకుంటాం. అలా చేయడం వల్ల ఎంతో సంతోషం కలుగుతుంది. ఆత్మీయులు ఆప్యాయంగా హత్తుకుంటే మనసులో ఉండే బాధలు, ఒత్తిళ్లన్నీ పటాపంచలైపోతాయి అంటున్నారు పరిశోధకులు. బాధతో కుంచించుకుపోయినా, ఆనందంతో ఉప్పొంగిపోతున్నా, ఒత్తిడితో సతమతమవుతున్నా.. ఇలా ఎటువంటి ఫీలింగ్ అయినా ఒకరితో పంచుకోవడానికి కౌగిలి వారధిగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఇక కౌగిలించుకోవడం ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. ఇష్టమైన వారిని కౌగిలించుకోవడం వల్ల స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ ఉత్పత్తి తగ్గుతుంది. అంటే కౌగిలితో ఒత్తిడి తగ్గుతుందని.. అంతేకాక హగ్ తో ఆక్సిటోసిన్ విడుదల అవుతుందని అంటున్నారు. ఇంకా హగ్ తో ఏలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Read also: అన్న రమేష్ బాబు కుటుంబానికి అండగా మహేష్ బాబు!
1) సెరోటోనిన్.
సిరోటోనిన్ అనే హార్మోన్ మన ఒత్తిడి స్థాయిలను నియంత్రిస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు శరీరంలోని సెరటోనిన్, ఆక్సిటోసిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇలా విడుదలైనప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది.
Advertisement
2) డోపమైన్.
ఇది మెదడును ప్రేరేపించే రసాయన హార్మోన్. ఇవి శరీరంలో విడుదలైన తర్వాత సంతోషం కలుగుతుంది. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. నిరాశ, ఆందోళన వంటి సమస్యలు ఉండవు.
3) ఆక్సిటోన్.
ఈ ఆక్సి టౌన్ హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దీనిని లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది భాగస్వాముల మధ్య దూరాన్ని తగ్గించి ప్రేమను పెంచుతుంది.
4) ఇలా ఒకరినొకరు కౌగిలించుకోవడం వల్ల భయాన్ని కూడా తగ్గించుకోవచ్చని.. ఒత్తిడిని తగ్గించడానికి కౌగిలి దోహదపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. సంక్రమ్యత, హైపోతెర్మీయా మొదలైన ఇతర వ్యాధులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇక పిల్లలకు తల్లిదండ్రుల కౌగిలి కూడా చాలా అవసరం. తల్లిదండ్రుల స్పర్శతోనే బిడ్డ ఎలాంటి భయాలు లేకుండా ఉండగలుగుతాడు. ఆలింగణం అనేది మానవ సంబంధాలను ఎన్నో రెట్లు పెరిగేట్లు చేస్తుంది.
Also Read: హిట్ 2 బ్యూటీ మీనాక్షి చౌదరి బ్యాక్ గ్రౌండ్ ఇదే