Advertisement
2023 ఐపీఎల్ సీజన్ కు జరిగే వేలంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 23న కోచి వేదికగా ఈ మినీ యాక్షన్ జరుగుతుందని ప్రకటించింది. ఈ టోర్నీకి ఈసారి 991 మంది రిజిస్టర్ అయ్యారని, వీరిలో 714 మంది భారతీయులు కాగా 277 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారని బోర్డు పేర్కొంది. ఈ టోర్నీకి దరఖాస్తు చేసుకున్న విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా ఆస్ట్రేలియన్లే ఉన్నారు.
Advertisement
ప్రతి మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. ఈ థ్రిల్ ను మరింత పెంచేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి మరొ సరికొత్త రూల్ ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ 2023 నుంచి ప్రతి మ్యాచ్ లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని ప్రకారం ప్రతి మ్యాచ్ లో ఒక సబ్ స్టిట్యూట్ ప్లేయర్ పాత్ర పరిధి మరింత పెరుగుతుంది. అంటే అతను జట్టు విజయాల్లో మరింత కీలక పాత్ర పోషిస్తున్నాడు అన్నమాట. ఇటీవల ఈ నిబంధనను ప్రయోగాత్మకంగా సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో కూడా బీసీసీఐ అమలు చేసింది. అక్కడ సక్సెస్ సాధించడంతో ఈ రూల్ ను ఐపిఎల్ లో కూడా అమలు చేయాలని డిసైడ్ అయ్యింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నింటికీ తమ నిర్ణయం గురించి బీసీసీఐ వివరాలు తెలియజేసింది.
Advertisement
అసలేంటి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ : సింపుల్ గా చెప్పాలంటే సబ్ స్టిట్యూట్ ప్లేయర్ నే ఇంపాక్ట్ ప్లేయర్ గా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఫుట్ బాల్, రగ్బీ ఆటలను చూసే వారికి ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతానికి టాస్ వేశాక ప్రకటించిన తుది జట్టు ప్లేయర్లకు మాత్రమే బ్యాటింగ్, బౌలింగ్ చేసే వీలు ఉంది. మధ్యలో ఎవరైనా గాయపడితే వారి స్థానంలో సబ్స్టిట్యూట్ గా వచ్చే ప్లేయర్ కేవలం ఫీల్డింగ్ వరకే పరిమితం అవుతాడు.