Advertisement
Yadamma Raju Wife Name, Background, Images: ఈటీవీలో ప్రసారమయ్యే పటాస్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కమెడియన్ యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కామన్ మ్యాన్ గా ఈ షోకి వచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి కమెడియన్ అయ్యాడు యాదమ్మ రాజు. ఇతని స్కిట్ లకు చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే యాదమ్మ రాజు కొన్ని నెలల నుంచి స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఆమధ్య ఆమెను ఓ ప్రోగ్రాం మధ్యలో స్టేజ్ పైకి తీసుకువచ్చి అందరికీ పరిచయం చేశాడు. వీళ్ళిద్దరూ కలిసి యూట్యూబ్ వీడియోలు కూడా చేశారు.
Advertisement
Read also: తమతో నటించిన హీరోయిన్లను పెళ్లి చేసుకున్న తమిళ హీరోలు !
Advertisement
ఇక ఎట్టకేలకు యాదమ్మ రాజు – స్టెల్లా తమ కుటుంబాన్ని ఒప్పించారు. అంతేకాకుండా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది. వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. అయితే ఈ ఎంగేజ్మెంట్ ఫోటోలలో పెళ్లికూతురు స్టెల్లా కి కానీ, యాదమ్మ రాజుకి కానీ నుదుటిపై బొట్టు లేదు. నిజానికి యాదమ్మ రాజు హిందు, స్టెల్లా క్రిస్టియన్ అమ్మాయి కావడంతో కొంతమంది యాదమ్మ రాజు పై విమర్శలు గుప్పిస్తున్నారు. ” ఏరా రాజుగా.. మొత్తానికి తల్లిదండ్రుల పుట్టుపూర్వోత్తరాలు వారి సంప్రదాయాలు అన్ని గాలికి వదిలేసి కేవలం ఒక ఆడదాని కోసం మతం మారావు. ముఖానికి ఇంత బొట్టు కూడా లేదు రాజుగా సిగ్గు లేదు నీకు “అంటూ నేటిజన్లు తిట్టడం ప్రారంభించారు.
యాదమ్మ రాజు ఎంగేజ్మెంట్ ఫోటోలు చూసి కొంతమంది తెగ కుళ్ళుకుంటున్నారు. ఇంకొంతమంది మాత్రం ప్రేమకు కులమతాలు అడ్డుకావని నిరూపిస్తూ తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం కుటుంబ సభ్యులను ఒప్పించి మరి వివాహం చేసుకోబోతుండడంతో యాదమ్మ రాజు తెగింపుకు ఫిదా అవుతున్నారు. ఈ రోజుల్లో కూడా కులమతాలు చూడడం ఏంటని మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇక త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతుండడంతో అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.