Advertisement
నాని, నజ్రియా నజీమ్ కలిసి నటించిన చిత్రం ‘అంటే సుందరానికి’. నజ్రియా నటించిన తొలి తెలుగు సినిమా కావడం విశేషం. సింపుల్ స్టోరీస్ తో ఫన్ జనరేట్ చేస్తూ సక్సెస్ అందుకునే వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 10న విడుదలైన విషయం తెలిసిందే. అయితే నాని నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ అవ్వలేదని, కమర్షియల్ గా ఈ చిత్రం వర్కౌట్ అవ్వలేదని టాక్. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు అందనంత దూరంలోనే ఆగిపోయిందని తెలుస్తోంది. మొత్తానికి నానికి ఈ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది.
Advertisement
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అత్తారింటికి దారేది సినిమాకు ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే, అత్తారింటికి దారేది సినిమాలో నదియా, పవన్ కళ్యాణ్ కు అత్తగా నటించిన సంగతి తెలిసిందే. ఇక నదియాకు ఇద్దరు కూతుళ్లు ఉండగా, పెద్ద కూతురు మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే అప్పటికే పెద్ద కూతురుకు కోట శ్రీనివాసరావు మనవడితో నిశ్చితార్థం పూర్తవుతుంది.
Advertisement
దాంతో తన రెండో కూతురు సమంతను ఇచ్చి పెళ్లి చేస్తానని కోటకు నదియా మాట ఇస్తుంది. ఇక అంటే సుందరానికి సినిమాలో కూడా అదే మాదిరిగా ఓ సన్నివేశం ఉంది. ఈ సినిమాలో కూడా నదియా, నానికి అత్తగా నటించింది. నదియా పెద్ద కూతురు ఓ వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంటుంది. దాంతో నదియా రెండో కూతురైన నర్జీయాను ప్రేమ వివాహం కాకుండా తాము చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతారు. ఇక ఇది గమనించిన ప్రేక్షకులు, అత్తారింటికి దారేది సినిమాను నెమరేసుకుంటున్నారు.
Also Read: F3 లో నటించిన ఈ నటుడి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ కావాల్సిందే !