Advertisement
బేబీ షామిలి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మందిని ఆకట్టుకున్న ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన ఈ ముద్దుగుమ్మ చిన్నతనం నుంచే తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ అభిమానుల్ని తన నటనతో కట్టిపడేసింది. రెండేళ్ల వయసులోనే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన అంజలి సినిమాలో మెంటల్లీ చాలెంజ్ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి మొదటి సినిమాతోనే నేషనల్ ఫీల్డ్ అవార్డుని సొంతం చేసుకుంది బేబీ షామిలి. “మెరిసే నవ్వుల పువ్వుల జాబిల్లి” అంటూ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతో మంది మనసుని దోచుకుంది.
Advertisement
Read also: రాజమౌళి తన నెక్స్ట్ కు మహేష్ బాబునే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా?
ఆ తర్వాత ఓయ్ సినిమాతో హీరోయిన్ గా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అయితే తొలి సినిమా ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. పైగా లావుగా ఉంది, ముఖంలో కల లేదు అంటూ నేటిజెన్ల ట్రోలింగ్ కి గురైంది. ఈ విమర్శలు తనకు తీవ్ర ఆవేదనను కలిగించాయని చెప్పిన షామిలి వెంటనే తన బరువును భారీగా తగ్గించుకొని చక్కటి రూపాన్ని పొందింది. ఆ తర్వాత నాగశౌర్య అమ్మమ్మ గారి ఇల్లు మూవీతో హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ ఆఫర్స్ రాకపోవడంతో ఇక నటనకు గుడ్ బై చెప్పి చదువుపై ఫోకస్ పెట్టింది. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా 42 సినిమాలకి పైగా నటించిన షామిలి అప్పుడున్న హీరోలకు దీటుగా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంది.
Advertisement
కానీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ అందుకోలేకపోయింది. అమ్మమ్మ గారి ఇల్లు సినిమా తర్వాత ధనుష్ కోడి సినిమాతో సెకండ్ హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించింది షామిలి. కానీ షూటింగ్ కి సమయానికి రాకపోవడం, దీనికి తోడు తన డిమాండ్స్ తో నిర్మాతలను ఇబ్బంది పెట్టేదట. ఇలా ధనుష్ లాంటి క్రేజీ స్టార్ పక్కన ఆఫర్ ని చేజేతులా పోగొట్టుకుంది షామిలి. ఇదొక్కటే కాక “వల్లియుం తెట్టి పుల్లియుం తెట్టి” అనే మలయాళ చిత్రంలో కూడా షూటింగ్ కి సమయానికి రాకుండా ఇబ్బంది పెట్టేదట. ఇలా తన ప్రవర్తనతో తన సినీ కెరీర్ ని నాశనం చేసుకుందని ఇప్పటికీ సినీ విశ్లేషకులు కామెంట్లు చేస్తుంటారు.