Advertisement
టాలీవుడ్ అగ్ర నిర్మాత రామానాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రామానాయుడు ఒక నిర్మాతగా 150 సినిమాలు తయారు చేసి తన పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. తెలుగులో అని కాకుండా 13 భాషలలో సినిమాలు తీసి ప్రజలకు వినోదాన్ని కలిగించారు. రామానాయుడు తన పెద్ద కొడుకు దగ్గుబాటి సురేష్ పేరు మీరు గానే సురేష్ ప్రొడక్షన్స్ మొదలుపెట్టారు. చిన్న కొడుకు దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమాలో ఒక పెద్ద హీరో. రామానాయుడు మొదట్లో తన స్నేహితులతో కలిసి ఒక సినిమాను తయారు చేశారు.
Advertisement
కానీ అది అంతగా విజయవంతం కాలేదు. 1964వ సంవత్సరంలో తన పెద్ద కొడుకు సురేష్ పేరుమీదుగా సురేష్ ప్రొడక్షన్స్ ను మొదలుపెట్టారు. 1971లో తీసిన సినిమా ప్రేమ్ నగర్ అనే సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వర్ రావు మరియు వాణిశ్రీ నటించారు. ఈ సినిమాను తమిళ్ మరియు హిందీ భాషలలో కూడా డబ్ చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా, రామానాయుడు కొడుకులు ఒకరు హీరో, ఒకరు ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యారనే ప్రశ్న అందరిలో మెదులుతోంది. అయితే..దానికి కారణం ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
నిజానికి సురేష్ బాబు సైతం మంచి అందగాడు. ఆ రోజుల్లో హీరోగా వచ్చి ఉంటే వెంకటేష్ కన్నా పెద్ద హీరో అయ్యోవారు. కానీ ప్రొడక్షన్ చేయాలంటే అన్ని విభాగాల్లో పట్టు ఉండాలి. డబ్బు మేనేజ్ చేయాలి. థియేటర్స్ ని హోల్డ్ చేయాలి. ఇన్ని చేయాలంటే మంచి సమయస్ఫూర్తి, తెలివితేటలు ఉండాలి. అవి సురేష్ బాబు లో ఉన్నాయని రామానాయుడు నమ్మరు. అందుకే అలా ప్రొడక్షన్ లోకి పంపించారు. ఇక వెంకటేష్ చాలా అమాయకుడు అని రామానాయుడు నమ్మరు. ఎవరినైనా నమ్మి మోసపోతారేమో అని అలాగే హైట్, పర్సనాలిటీ ఉంది కాబట్టి వెండితెర పైన బ్రతుకుతాడు అని హీరోగా చేశాడు. రామానాయుడు వేసిన ఈ లెక్క ఎక్కడా తప్పలేదు.