Advertisement
పెళ్లి అనేది ఈ జీవితంలో చాలా ముఖ్యమైనది. వివాహ బంధంలో భాగస్వాములు ఇద్దరు ఒకరిని ఒకరు పరస్పరం గౌరవించుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు భార్యాభర్తల మధ్య వస్తూ ఉంటే ఆ బంధం ఎంత కాలం నిలవదు. ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. అపార్ధాలు, అభిప్రాయ భేదాలను సర్ది చెప్పుకునేందుకు నిజాయితీగా ఉండడం, మాట్లాడుకోవడమే ఉత్తమమని గ్రహించాలి. అప్పుడే గొడవలు సద్దుమణిగి సంతోషాలు విరబూస్తాయి. ఒకరి పట్ల ఒకరు నమ్మకంతో ఉండాలి. అనుమానం అనే భూతం ఒక్కసారి భార్యాభర్తల బంధం లోకి ప్రవేశిస్తే.. ఇక అది చేసే దారుణాలు ఊహించడం కూడా కష్టమే.
Advertisement
Read also: తొలి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న కొందరు ప్రముఖులు
తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వారి సంసారంలో అనుమానమే పెనుభూతమైంది. తిరువన్నామలై జిల్లా సెయ్యురు తాలూకా అన్న పూదూరు గ్రామానికి చెందిన రంజిత్ చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతను తన ఎదురింటికి చెందిన కౌసల్య (23) ను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఏడాది వయసున్న ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇలా సంతోషంగా సాగుతున్న వారి జీవితంలోకి అనుమానం అనే భూతం ప్రవేశించింది. భార్యపై అనుమానంతో రంజిత్ తరచూ ఘర్షణ పడేవాడు. వీటితోపాటు రంజిత్ తండ్రి రాజు, తల్లి శాంతి తరచూ వరకట్నం కోసం వేధించేవారు. ఇక వీరి వేధింపులు తాళలేక కొన్ని నెలల క్రితం కౌసల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Advertisement
పోలీసులు వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపేశారు. అలా కొద్ది రోజులపాటు వారిద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఓ రోజు ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో భార్యపై అనుమానంతో రంజిత్ మరోసారి ఘర్షణ పడ్డాడు. ఆ సమయంలో ఆగ్రహించిన రంజిత్ భార్యకి కట్టిన తాళి దారంతోనే గొంతు బిగించి కౌసల్యని హత్య చేసి తన కుమారుడిని తీసుకుని ఇంటి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న అనకావూరు పోలీసులు రంజిత్ పై కేసు నమోదు చేసి కౌసల్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రంజిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇలా అనుమానం అనే పెనుభూతం వారి పచ్చని సంసారంలో నిప్పులు పోసింది.
Read also: భార్య గురించి భర్త ఈ 4 విషయాలు తెలుసుకోవాల్సిందే..అప్పుడే వారి జీవితం !