Advertisement
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు కింగ్ అక్కినేని నాగార్జున. చిత్ర పరిశ్రమలో నట వారసులుగా ఎంతో మంది హీరోలు తెరంగేట్రం చేశారు. అందులో కొంతమంది హీరోలు మాత్రమే అభిమానుల గుండెలలో స్థానం సంపాదించుకున్నారు. అలాంటి వారిలో నాగార్జున ఒకరు. అక్కినేని నట వారసునిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు నాగార్జున. నాగేశ్వరరావు నట వారసునిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నాగార్జున ఏనాడు కూడా తండ్రిని అనుకరించకుండా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ టాప్ 3 హీరోలలో ఒకరిగా మూడు దశాబ్దాల పాటు కొనసాగారు. తనదైన నటనతో ప్రేక్షకుల మనసులో మన్మధునిగా నిలిచారు.
Advertisement
Read also: తొలి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న కొందరు ప్రముఖులు
ఆరు పదుల వయసు మీదికి వచ్చినా కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేయడం.. వాళ్ల రేంజ్ లోనే గ్లామర్ ని మెయింటైన్ చేయడం నాగార్జున స్టైల్. అందుకే ఈయనని టాలీవుడ్ కి మన్మధుడు అంటారు. ఇండస్ట్రీలో నాగార్జున అందరితోను స్నేహపూర్వకంగానే మెలుగుతూ ఉంటారు. ఇక ఈయన పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. అక్కినేని అమల ఈయన రెండో భార్య. అయితే అంతకంటే ముందు నాగార్జున దగ్గుపాటి ఇంటి అమ్మాయి లక్ష్మిని వివాహం చేసుకున్నారు. దగ్గుపాటి రామానాయుడు గారి అమ్మాయి లక్ష్మితో నాగార్జునకి మొదటి వివాహం జరిగింది. వీరిద్దరి సంతానమే నాగచైతన్య.
Advertisement
ఇక నాగార్జున – అమల సంతానం అఖిల్ అన్న సంగతి తెలిసిందే. అయితే నాగార్జున – లక్ష్మి కొన్ని కారణాల వల్ల ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆట దగ్గుబాటి కుటుంబం.. ఇటు అక్కినేని కుటుంబాల మధ్య సత్సంబంధాలే కొనసాగుతున్నాయి. అయితే తాజాగా నాగార్జున – లక్ష్మి పెళ్లి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ అభిమాన హీరో అప్పట్లో ఇలా ఉన్నాడా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. పెళ్లి పీటలపై కూర్చున్న నాగార్జున అచ్చం పెద్దకొడుకు నాగచైతన్య లాగే ఉన్నాడంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
Read also: భార్య గురించి భర్త ఈ 4 విషయాలు తెలుసుకోవాల్సిందే..అప్పుడే వారి జీవితం !