Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పాపులారిటీ అంతా కాదు. ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా మరికొంతమంది కష్టపడి పైకి వచ్చారు. ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. అయితే, మన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుల వారసులు కూడా ఉన్నారు. అయితే, ఆ వారుసులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు ఈవివి సత్యనారాయణ. ఎన్నో సినిమాలు తీసి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఈయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈవివి వారసులుగా ఆర్యన్ రాజేష్ మరియు అల్లరి నరేష్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
నిర్మాతగా మరియు దర్శకుడుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రవి రాజా కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా అటు హీరోగా ఇటు విలన్ గాను ఆది ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నారు.
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి కూడా టాలీవుడ్ కు హీరోగా పరిచయమయ్యాడు. బుజ్జిగాడు సినిమాలో బుజ్జి ప్రభాస్ గా నటించిన ఆకాష్ పూరి ప్రస్తుతం ఇండస్ట్రీలో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆకాష్ పూరి రొమాంటిక్ అనే చిత్రంలో నటించగా ఈ సినిమాలో తనయుడి కోసం పూరి జగన్నాథ్ లక్డీకపూల్ అంటూ ఓ పాట రాసి పాడారు.
Advertisement
మ్యాచో మ్యాన్ గోపీచంద్ తండ్రి కూడా ఓ దర్శకుడు అనే విషయం అతి కొద్ది మందికే తెలుసేమో, కానీ గోపీచంద్ తండ్రి టి.కృష్ణ నేటి భారతం, దేశంలో దొంగల ప్రతిఘటన లాంటి సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలకు ఆయనే ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక డైరెక్టర్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ప్రస్తుతం హీరోగా మరియు విలన్ గా రాణిస్తున్నారు.
టాలీవుడ్ కు రీసెంట్ గా పరిచయమైన హీరో సంతోష్ శోభన్ తండ్రి కూడా దర్శకుడే. వర్షం, బాబి, రవితేజ చంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శోభన్ కుమారుడే సంతోష్ శోభన్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే పేపర్ బాయ్, ఏక్ మినీ కథ లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.
Read also: భార్య గురించి భర్త ఈ 4 విషయాలు తెలుసుకోవాల్సిందే..అప్పుడే వారి జీవితం !