Advertisement
సాధారణంగా చాలామంది ఒక ఇంటిని నిర్మించేటప్పుడు కానీ, లేదా ఆ ఇంటిని నిర్మించాక గృహప్రవేశం తర్వాత కానీ దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు. అలా గ్రామాలలో, పట్టణాలలో, ఏ ఇతర వ్యాపార సంస్థలో కానీ వారి ఇళ్ళ ముందు దిష్టిబొమ్మలు అనేవి చూస్తూనే ఉంటాం. అలా దిష్టి బొమ్మలు పెట్టుకోవడం వలన దిష్టి తగలదు అని నమ్మకంతో అవి పెట్టుకుంటారు. అసలు ఈ దిష్టిబొమ్మల ఇంటి ముందు ఎందుకు పెడతారు. అవి పెట్టడం వల్ల లాభమా? నష్టమా? అసలు ఎలాంటి దిష్టిబొమ్మలు ఇంటి ముందు పెట్టుకోవాలో తెలుసుకుందాం.
Advertisement
Read also; ఎదురింటి వ్యక్తినే ప్రేమించి పెళ్లి చేసుకుంది.. పాపం ఇది ఊహించలేదు!
Advertisement
చాలామంది ఇంటి ముందు పెట్టే దిష్టిబొమ్మలు అనేవి ఎర్రగా, రాక్షసుల లాగా, నాలుక మీద తేలు బొమ్మతో చూడడానికి చాలా భయంకరంగా ఉండే విధంగా దిష్టిబొమ్మలు పెడుతూ ఉంటారు. అలాగే కొత్తగా కట్టే బిల్డింగ్ ల ముందు, లేదా కట్టిన బిల్డింగ్ ముందు గానీ ఇలా పెడుతూ ఉంటారు. మరికొంతమంది వీధిపోటులకు, ఇతరత్రా వాటికి పెడుతూ ఉంటారు. అయితే ఎలాంటి దిష్టి బొమ్మలు పెడితే ఎలాంటి ఫలితం వస్తుందని చాలామంది సందేహంలో ఉంటారు. సాధారణంగా ప్రతి ఇంట్లో మనం ఆరాధించే దైవం ఉంటుందని నమ్ముతాం. సాధారణంగా.. ఏదైనా దేవుని ఉత్సవం జరిగేటప్పుడు ఆ ఉత్సవం ముందు ఒక దిష్టిబొమ్మను పెడితే ఎంత అసహ్యంగా ఉంటుందో ఇంటి ముందు దిష్టిబొమ్మను పెడితే అలా ఉంటుందని అంటున్నారు ఆస్ట్రాలజీ నిపుణులు.
వాకిట్లో శంకు చక్రాలు, నామాలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇవి పెట్టడం వల్ల పాజిటివ్ వైబ్స్ కలుగుతాయని, లేదా ఏదైనా భగవంతుని ఫోటో పెట్టుకోవాలని చెబుతున్నారు. పంచముఖ ఆంజనేయస్వామి పటాన్ని వాకిట్లో పెట్టుకుంటే ఎటువంటి దుష్ట శిక్షణ అయినా సరే మన ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది. ఈ యొక్క పంచముఖ హనుమాన్ పటాన్ని ఇంటి ముందు పెట్టుకున్నట్లయితే మనకు అన్ని లాభాలు, సుఖమైన జీవన విధానం ఆ ఇంట్లో ఉంటుందని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.
Read also: సీక్రెట్ గా పెళ్లి పీటలెక్కిన హైపర్ ఆది..? వధువు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!