Advertisement
బుల్లితెరలో సక్సెస్ అయిన కామెడీ షో ఏదైనా ఉందంటే అది జబర్దస్త్ అని చెప్పాలి. ఈ కామెడీ షో కి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాప్ రేటింగ్ తో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది జబర్దస్త్. దాదాపు 10 ఏళ్లుగా ఈ షో అభిమానులను అలరిస్తోంది. ఈ కామెడీ షో లో కంటెస్టెంట్ గా చేసిన వారు చాలామంది కమెడియన్లు ఇప్పుడు సెలబ్రిటీలుగా మారిపోయారు. మొదట్లో ఈ షోలో కేవలం మెయిల్ కమెడియన్స్ మాత్రమే ఉండేవారు. మగవాళ్ళు ఆడవారిగా వేషాలు వేసుకొని స్కిట్స్ చేసేవారు. కానీ ఇప్పుడు లేడీ కమెడియన్స్ కి కూడా అవకాశాలు దక్కుతున్నాయి. ఫైమా, రోహిణి, పవిత్ర వీరి కామెడీతో అతి తక్కువ సమయంలోనే కమెడియన్సుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Advertisement
Read also: బాలయ్య తన కూతుర్లని ఎందుకు హీరోయిన్స్ చేయలేదో తెలుసా..?
అంతేకాదు జబర్దస్త్ లో అబ్బాయిలకు పోటీగా వీరు రాణిస్తున్నారు. ఇంకొంతమంది సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఫేమస్ అయిపోతున్నారు. అయితే జబర్దస్త్ లో ప్రేమ జంటలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇలా సుధీర్ – రష్మీ నుంచి.. నరేష్ – ఐశ్వర్య, నూకరాజు – ఆసియా, ఇమాన్యుయల్ – వర్షా అన్ని జంటలు ఆన్ స్క్రీన్ లో సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో కొంతమంది నిజజీవితంలో పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం జబర్దస్త్ లో మరో కొత్త జంట పెళ్లికి రెడీ అవుతుంది. అదే జబర్దస్త్ తేజ – పవిత్ర. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే అకస్మాత్తుగా మా పెళ్లి షాపింగ్ అంటూ వీడియో షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.
Advertisement
“మాకు పెళ్లి కుదిరింది.. అందుకే పెళ్లి చీరల కోసం షాపింగ్ చేయడానికి వచ్చాం” అంటూ హెడ్డింగ్ పెట్టి తేజ తో కలిసి వీడియోలో కనిపించింది పవిత్ర. మాకు పెళ్లి కుదరడంతో అందుకే పెళ్లి చీరలు కొనడం కోసం షాపింగ్ కి వచ్చాం అంటూ తేజ చెప్పగా.. ఊరికే అంటూ సైగలు చేసింది పవిత్ర. అయితే షాపింగ్ లో తేజా తన కామెడీతో పవిత్ర కి ఎంత చిరాకు తెప్పించినా.. షాపింగ్ చేసినంత సేపు ఓపిక పట్టిన పవిత్ర తేజకు తెలియకుండానే అతని కార్డుతోనే బిల్లు కట్టింది. అయితే వీడియో మొత్తం చూసిన తర్వాత వీరికి నిజంగా పెళ్లి ఫిక్స్ అవ్వలేదని, ఓ వీడియో కోసం మాత్రమే వీరు పెళ్ళి షాపింగ్ పేరుతో ఇలా చేశారని తెలుస్తోంది. దీంతో వీరిద్దరి తీరుపై నెటిజెన్స్ విమర్శలు చేస్తున్నారు. మరికొంతమంది మీ కాంబినేషన్ అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు.
Read also: ఎదురింటి వ్యక్తినే ప్రేమించి పెళ్లి చేసుకుంది.. పాపం ఇది ఊహించలేదు!