Advertisement
తెలుగు ఇండస్ట్రీ లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం కలిగిన హీరో. ఆయన అందరు హీరోల్లా కాకుండా చాలా డిఫరెంట్ స్టైల్లో నటన కానీ, క్యారెక్టర్ కానీ ఉంటుంది. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ విషయానికి వస్తే ఏ హీరోకి లేనంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతమని చెప్పవచ్చు. ఆయన సినిమాలు చేస్తూనే మరోవైపు జనసేన పార్టీ తో ప్రజలకు దగ్గరవుతున్నారు. అంతటి పేరు ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఏ దర్శకనిర్మాతలకైనా కోరిక అనేది ఉంటుంది. ఆయన రాజకీయాల్లోకి రాకముందు సినిమాలు తప్ప వేరే ఏ ధ్యాస ఉండేది కాదు. దీంతో దర్శక నిర్మాతలు ఎవరైనా సరే ఆయనకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకొని హాయిగా ఉండేవారు.
Advertisement
Advertisement
కానీ ప్రస్తుతం అలా లేదు కాబట్టి ఆయనకు ముందుగానే అడ్వాన్సు ఇచ్చిన టైం సెట్ చేసుకున్నా సెట్స్ లోకి వస్తారో రారో అనే విషయం కూడా క్లారిటీ గా ఉండటం లేదు. ఎందుకంటే ఆయన ప్రజల్లోకి వెళ్లడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఏ.ఎం రత్నం, దిల్ రాజ్ వంటి నిర్మాతలే ఆయనకు అడ్వాన్సు ఇచ్చి సెట్స్ లోకి రాగానే చక చక షూటింగ్ కంప్లీట్ చేసేస్తుంటారు. కానీ ఆయన అక్కడకు రావడమే చాలా కష్టమైన పని. అయితే పవన్ ఇలా రెండు పడవల ప్రయాణం అనేది నిర్మాతలకు, దర్శకులకు చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇప్పటికే పూర్తి అవ్వాల్సిన హరిహర వీరమల్లు షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా చెప్పలేకపోతున్నారు.
మైత్రి మూవీ మేకర్స్, హరీష్ శంకర్ కాంబోలో రావలసిన భవదీయుడు భగత్ సింగ్ అసలు ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పలేకపోతున్నారు. ఇటీవల వినోదయసీతం మూవీ తెలుగు రీమేక్ చేసేందుకు 40 రోజుల డెడ్ లైన్ పెట్టారు. ఈ విధంగా పవన్ చాలా బిజీగా ఉండడంతో దర్శకనిర్మాతలు ఈ సినిమాలు ఏవిధంగా కంప్లీట్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ దసరా తర్వాత పూర్తి సమయం రాజకీయాల్లోకి కేటాయించనున్నారు అని తెలుస్తోంది. ఇంతలోపే ఈ సినిమాలను ఎలాగైనా కంప్లీట్ చేయాలని వారు భావిస్తున్నారు.
also read;
రంగస్థలంలో చిట్టిబాబు, జగపతి బాబును అలా కొట్టి చంపడం వెనక ఉన్న అసలు ట్విస్ట్ ఇదేనా..!