Advertisement
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించగలరు. ఇక సినిమా రంగంలో ఉండే వారైతే అది ఏ పని అయినా పరవాలేదు అనుకునేవారు చాలామందే ఉన్నారు. చాలామంది హీరోలు అవుదామని వచ్చి దర్శకులు కావచ్చు, మరి కొంతమంది దర్శకులుగా వచ్చి హీరోలుగా సెటిల్ అయిన వారు కూడా ఉన్నారు. ఇంతకీ అలా కష్టపడిన వారు ఎవరు? ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి హీరోలుగా రాణిస్తున్న వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Read also: చలికాలంలో స్నానం చేసేటప్పుడు ఈ పొరపాటు చేస్తే ప్రాణాలకే ప్రమాదకరం
1) నాని.
అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన నేచురల్ స్టార్ నాని అసలు పేరు నవీన్ బాబు. అప్పట్లో బాపు దరచకత్వంలో వచ్చిన రాధాగోపాలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తర్వాత అష్టచెమ్మ సినిమాలో హీరోగా అవకాశం రావడం.. ఆ సినిమా హిట్ కావడంతో ప్రస్తుతం టాప్ హీరోల లిస్టులో చేరిపోయి వరుస సినిమాలు చేస్తున్నాడు.
2) రాజ్ తరుణ్.
అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించాడు రాజ్ తరుణ్. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించిన రాజ్ తరుణ్ కి ఉయ్యాల జంపాల సినిమాలో హీరోగా అవకాశం రావడంతో అతడి ఫేట్ మారిపోయింది.
Advertisement
3) రవితేజ.
మాస్ మహారాజా రవితేజ కూడా మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గానే తన కెరీర్ ని ప్రారంభించారు. హీరో అవకాశాల కోసం తిరిగితిరిగి అలసిపోయిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రతి బంద్, ఆజ్ కా గూండారాజ్, నిన్నే పెళ్ళాడుతా వంటి సినిమాలకు పని చేశారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు రావడంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం స్టార్ హీరోల లిస్టులో చేరిపోయారు.
4) సిద్ధార్ద్.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం వద్ద సిద్ధార్ద్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత అతనికి హీరోగా అవకాశాలు రావడం.. అతను ప్రూవ్ చేసుకోవడంతో హీరోగా ఫుల్ బిజీ అయ్యాడు.
5) నిఖిల్.
విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నిఖిల్ కాలేజీలో చదివే రోజుల్లోనే స్నేహితులతో కలిసి హైదరాబాది నవాబ్స్ అనే సినిమాను తీశారు. ఈ చిత్రంలో నటించడంతోపాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా శ్రమించారు.
Read also: పెళ్లి అయిన కొత్తలో నయన తార పై అత్త షాకింగ్ కామెంట్స్!