Advertisement
ఇటీవలి కాలంలో హీరోయిన్లు ఒకరి తరువాత ఒకరు వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నటి సుకృతి కూడా పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెప్పింది. సుకృతి అని నేరుగా పేరు చెబితే ఫ్యాన్స్ గుర్తించడం కష్టమే.. కానీ కేరింత సినిమాలో భావన అని చెబితే ఇట్టే గుర్తు పడతారు. జూలై 5 న ఢిల్లీలో జన్మించింది నటి సుకృతి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఈమె తండ్రి పెంపకంలో పెరిగింది. సుకృతి తండ్రి స్వగ్రామం నెల్లూరు జిల్లా కావలి. రాజస్థాన్ బనస్థలి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది సుకృతి.
Advertisement
Read also: ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు మంచి కం బ్యాక్ ఇచ్చిన 10 సినిమాలు
Advertisement
సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన కేరింత సినిమా కమర్షియల్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీదివ్య మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ.. తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది సుకృతి. ఈ సినిమాలో గింగిరాల జుట్టుతో, స్టైలిష్ గా కనిపించిన భావన అసలు పేరు సుకృతి అంబటి. ఈ చిత్రం ద్వారా ఆమె నటనకు మంచి పేరు వచ్చినప్పటికీ ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. పై చదువుల కారణంగా అబ్రాడ్ కి వెళ్లిన సుకృతి సోషల్ మీడియాలో మాత్రం ఆక్టివ్ గానే ఉంటుంది. అలా ఈ ఏడాది జూన్ లో తన ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసి ఒక్కసారిగా అందరిని సర్ప్రైజ్ చేసింది.
అక్షయ్ సింగ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకొని ఫోటోలు, వీడియోలను సుకృతి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పలువురు సినీ నటులు, అభిమానులు ఈ జంట కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తాజాగా ఏకంగా పెళ్లి చేసుకుని మరో గుడ్ న్యూస్ చెప్పింది. బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సోమవారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read also: రష్మికని అంతలా వేధించారా ? ‘కాంతార’ సినిమాకు ఆమెకు సంబంధం ఏంటి?