Advertisement
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో ముగింపు దశకు చేరుకుంటున్న కొద్ది ఊహించని ట్విస్ట్ లు అయితే చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు బిగ్ బాస్ నీరసంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ మరికొన్నిసార్లు కంటెస్టెంట్స్ వారి స్ట్రాటజీ తో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. టాప్ 5 ఫైనలిస్ట్ లలో ఇనయ ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. అయితే అనూహ్యంగా 14వ వారంలో ఆమె బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి వచ్చింది.
Advertisement
బిగ్ బాస్ హౌస్ లో ఇనయా, సూర్య ఇద్దరు కూడా చాలా సాన్నిహిత్యంతో ఉండేవారు. చనువుతో మాట్లాడుకునేవారు. దాంతో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే టాక్ బయట బాగా వినిపించింది. ఇది ఇలా ఉంటే, ఇక ఇనయ పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ షో కి వచ్చే వరకు ఆమెకు ఎలాంటి ఫేమ్ లేదు. ఈ క్రమంలో ఇనయాకు చాలా కాలం క్రితమే పెళ్లి అయ్యిందంటూ, ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
Advertisement
పెళ్లికూతురుగా సిద్ధమవుతున్న ఇనయా ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ ఫోటో ఆధారంగా చూపుతూ ఈమెకు ఆల్రెడీ వివాహం జరిగిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఆ ఫోటోలో ఆమె పెళ్లికూతురు కాదు, స్పష్టత లేదు, అలాగే పక్కన ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు. కేవలం ఒక ఫోటో ఆధారంగా పెళ్లి జరిగిందన్న నిర్ణయానికి రాలేమని కొట్టి పారేస్తున్నారు.
Also Read: మీనా భర్త విద్యాసాగర్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాకవుతారు..?