Advertisement
తెలుగు ఇండస్ట్రీ లోనే మెగాస్టార్ చిరంజీవి అంటే కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల గ్రామానికి వెళ్లిన చిరంజీవి గురించి చెబుతారు. ఎందుకంటే అంతటి స్టార్ డమ్ సంపాదించుకున్న టాలెంట్ ఉన్న హీరో మెగాస్టార్. ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి అద్భుతమైన విజయం సాధించారు. ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించే టాలెంట్ మెగాస్టార్ సొంతం. ఆయన కొన్ని సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయగా, మరికొన్ని మూవీస్ లో మూడు పాత్రల్లో కూడా నటించి మెప్పించారు..
Advertisement
ఆ మూవీ ముగ్గురు మొనగాళ్లు. ఇందులో మెగాస్టార్ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించి అందరినీ అలరించారు. పోలీస్ ఆఫీసర్ గా, రౌడీ గా, డాన్స్ మాస్టర్ గా కనిపించారు. అయితే ఈ మూవీని తన సోదరుడు నాగబాబు స్వయంగా నిర్మించడం మరో విశేషం. అంజనా ప్రొడక్షన్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగబాబు నిర్మించారు. దీనికి రాఘవేంద్రరావు డైరెక్షన్ వహించగా మూవీ బంపర్ హిట్ అయింది. ఇందులో చిరంజీవి మూడు భిన్నమైనటువంటి పాత్రలో అద్భుతంగా నటించారు. దీనికోసం తన గొంతును మరియు లుక్ ను మార్చేసారు .
Advertisement
ఈ మూవీలో చిరంజీవికి జోడీగా రమ్యకృష్ణ నగ్మా రోజా నటించారు. అప్పట్లో గ్రాఫిక్స్ ఎక్కువగా లేదు కాబట్టి హీరోలు డబుల్ రోల్ లేదా త్రిబుల్ రోల్ చేయాలంటే వారి డూప్ లను వాడేవారు. అందుకే ముగ్గురు మొనగాళ్లు మూవీలో ఇద్దరు డూపులు నటించారు. ఈ డూప్ గా నటించింది మెగాస్టార్ వద్ద పనిచేస్తున్న పిఏ సుబ్బారావు, స్నేహితులు ప్రసాద రావులు నటించారు. మీరు చిరంజీవి బరువు మరియు ఎత్తులో సమానంగా ఉంటారు. కాబట్టి వీరిని డూప్ లుగా తీసుకున్నారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేసింది.
also read;
చైనా ఎందుకు క్రికెట్ ఆడటం లేదు.. దానికి గల కారణాలేంటి..?