Advertisement
కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1992లో విక్టరీ వెంకటేష్ కథానాయకునిగా సుందరకాండ సినిమా వచ్చింది. వెంకటేష్ నటించిన సినిమాలలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. లెక్చరర్ ని ప్రేమించే ఒక అమ్మాయి కథ ఈ సినిమా. ఈ చిత్రంలో వెంకటేష్ లెక్చరర్ గా నటించారు. తమిళ్ లో సుందరకాండం పేరుతో వచ్చిన సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా మీనా నటించగా.. వెంకటేష్ ను ఇష్టపడే స్టూడెంట్ పాత్రలో అపర్ణ నటించింది. ఈ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అపర్ణ. అసలు ఎవరు ఈ అపర్ణ? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈమెకు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎలా అవకాశం వచ్చిందో తెలుసుకుందాం.
Advertisement
Read also: ఎక్కువ సినిమాలు రీమేక్ చేసిన టాలీవుడ్ హీరోలు
ఈ చిత్రంలో అపర్ణ పాత్ర కోసం రాఘవేంద్రరావు ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలి అనుకున్నారు. కానీ ఆ అల్లరి పాత్రకు ఆమె అంతగా సూట్ కాకపోవడంతో ఓ కొత్త అమ్మాయి బాగుంటుందని వెతుకుతుండగా ఈ క్రమంలో ఆయన ఒక రోజు కేవివి సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న ఓ అమ్మాయి ఆయనకు బాగా నచ్చేసింది. ఆ అమ్మాయి అయితే ఈ పాత్రకు న్యాయం చేయగలుగుతుందని భావించిన రాఘవేంద్రరావు.. ఆమె సినిమాలలో నటిస్తుందో? లేదో? అనుకొని మౌనంగా ఉండి పోయారు.
Advertisement
అలా పది రోజుల తర్వాత హీరోయిన్ కోసం జరుగుతున్న ఆడిషన్స్ లో ఆ అమ్మాయి కనిపించింది. దీంతో ఆమెను చూసిన రాఘవేంద్రరావు వెంటనే సెలెక్ట్ చేసేసారు. ఆ తర్వాత నువ్వు ఎవరు అని రాఘవేంద్రరావు అడగగా.. “నా పేరు అపర్ణ. నేను నిర్మాత కేవీవి సత్యనారాయణ గారి మేనకోడలు అని చెప్పింది”.
దీంతో అసిస్టెంట్ తో ఆమెను వెంటనే ఓకే చేసేయండి అని చెప్పేసారట రాఘవేంద్రరావు. ఆ సినిమాలో లెక్చరర్ ని ప్రేమించే పాత్రలో అపర్ణ అద్భుతంగా నటించింది. ఆ తర్వాత ఆమెకు చాలా సినిమాలలో హీరోయిన్ అవకాశాలు వచ్చాయి. కానీ వాళ్ళ కుటుంబం సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట. ఆ తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం సినిమాలో మాత్రం ఆమె నటించింది. ఆ తరువాత సినిమాలకు దూరమై 2002లో పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది. ఇటీవల అపర్ణ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అవి చూసి చాలామంది షాక్ అయ్యారు.
Read also: ఆర్టీసీ నెంబర్ ప్లేట్‌పై ‘Z’ అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా?