Advertisement
ఏపీలో అధికారమే లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారు. అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ అనేక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అలాగే బాధితులకు అండగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయనపై రాసిన బుక్ ఆవిష్కరణ జరగడం జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
Advertisement
పవన్ పై గణ రాసిన ‘ది రియల్ యోగి’ అనే పుస్తకాన్ని మెగా బ్రదర్ నాగబాబు ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఈ కార్యక్రమం జరిగింది. సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, దర్శకుడు బాబీ, ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ సహా పలువురు హాజరయ్యారు.
ఒక కామన్ పాయింట్ అఫ్ వ్యూలో పవన్ గురించి గణ అద్భుతంగా రాశారన్నారు నాగబాబు. కళ్యాణ్ గురించి తాను ఏం అనుకుంటానో దగ్గరదగ్గరగా అలానే రాశాడని కొనియాడారు. అందుకే ఈ పుసక్తం ఇంకా నచ్చిందని.. పవన్ గ్రేట్ మోటివేటర్ అని చెప్పారు. మనిషిగా పుట్టాక పెరిగాం, జీవించామా.. చనిపోయామా అని కాకుండా ఒక లక్ష్యంగా ఉండాలని కోరుకున్నవాడు పవన్ అని అన్నారు.
Advertisement
‘‘తాను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు. లంచగొండి తనంతో సామాన్యుడిని ఇబ్బంది పెడుతున్న రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న అవినీతి రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయడానికి. అందుకే జనసేన పార్టీ పెట్టాడు. పైసా కూడా లేకుండా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడిపోయే వ్యక్తిత్వం కళ్యాణ్ ది. తన భవిష్యత్ గురించి ఆలోచన వుండదు. ఇవన్నీ ఒక యోగి, మానవుని ఉండాల్సిన లక్షణమా అనవసరం’’ అని చెప్పారు నాగబాబు.
పవన్ లా తాను ఒక్క రోజైనా ఉండగలనా? అన్న ప్రశ్నను తనకుతానే వేసుకున్నానన్నారు. పవన్ ఒక మనిషి ఎలా బతకాలి అనేదానిపై చాలా మంచి స్చీచ్ ఇచ్చాడన్నారు. ఇవన్నీ కామన్ మెన్ కు ఉండాల్సిన లక్షణాలు కావని.. యోగికి ఉండే లక్షణాలను ప్రశంసించారు. పిల్లల కోసం దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి జనసేన పార్టీ పెట్టినట్లు తెలిపారు. పదవి, డబ్బు కావాలంటే బీజేపీలో చేరితే ఎప్పుడో మంత్రి పదవి దక్కేదని అన్నారు. కానీ, స్వతంత్రంగా పార్టీ పెట్టాడన్నారు నాగబాబు.