Advertisement
ప్రస్తుతం ఇండియాలో రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఉన్నారు. కానీ జక్కన్న కంటే ముందు పాన్ ఇండియా క్రేజ్ ని సంపాదించుకున్న దర్శకుడు శంకర్. హీరోలతో సంబంధం లేకుండా కేవలం పోస్టర్ పైన ఈయన పేరు కనబడితే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. శంకర్ తన సినిమాలలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి సోషల్ మెసేజ్ ని కూడా ఇస్తుంటారు. శంకర్ తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాలలో అపరిచితుడు ఒకటి. నిర్లక్ష్యం, అవినీతి, కల్తీ వల్ల దేశం ఎలా అభివృద్ధి చెందకుండా ఉండిపోయిందో అనే కాన్సెప్ట్ తో శంకర్ ఈ మూవీ ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో మూడు విభిన్న పాత్రలలో విక్రమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
Advertisement
Read also: “లవ్ యు రాజా” అనే పదం పోసానికి ఎందుకు మేనరిజంగా మారింది?
Advertisement
అప్పట్లో ఈ చిత్రం క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కాదు. అయితే ఇటీవలి కాలంలో దర్శకులు సినిమాలు ఎంత జాగ్రత్తగా చేయాలంటే ఎక్కడ కూడా ప్రేక్షకులకు దొరకని విధంగా చేయాలి. లేదంటే ప్రేక్షకులు దానిని పట్టుకొని ట్రోల్ చేయడం జరుగుతుంది. సినిమా అంటే ఈరోజులలో లాజిక్ లేని మ్యాజిక్ అన్న విషయం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. కానీ కొన్ని సన్నివేశాల విషయంలో మాత్రం లాజిక్ ఉండాలి అనేది ప్రేక్షకుల ఆలోచన. అలాంటప్పుడు దర్శకులు జాగ్రత్త వహించకపోతే మాత్రం విమర్శల పాలు కావాల్సిందే. అలా శంకర్ కూడా ఒక చిన్న మిస్టేక్ చేశారు. ఆ మిస్టేక్ వల్ల ఆయన ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు.
ఈ చిత్రంలో మూడు పాత్రలలో ఒకటి రాము, మరొకటి రేమో, మూడవ పాత్ర అపరిచితుడు. అయితే రాము పాత్ర ఈ చిత్రంలో లాయర్ అన్న విషయం తెలిసిందే. ఓసారి బైక్ పై వెళుతుండగా బ్రేక్ వైర్ తెగితేనే ఆ కంపెనీని కోర్టుకు లాగుతాడు రాము. కానీ సినిమాలో రాము బండి నడిపేటప్పుడు మాత్రం హెల్మెట్ పెట్టుకోడు. అప్పుడు సినిమాలో దీన్ని ఎవరూ గమనించలేదు. కానీ ఆ ఫోటో ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్ని రూల్స్ మాట్లాడిన రాము బండిమీద వెళ్తూ హెల్మెట్ మాత్రం ధరించలేదంటూ ట్రోల్ చేస్తున్నారు నేటిజన్లు.
Read also: పవన్ మూడో భార్య ” అన్నాలెజ్‌నోవా ” ఆస్తుల చిట్టా !