Advertisement
నమ్రత, మహేష్ బాబు జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ మోస్ట్ అట్రాక్టివ్ జోడి నమ్రత, మహేష్ బాబు. వృత్తిపరంగా ఒకే రంగానికి చెందిన ఈ దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు గౌతమ్, కూతురు సితార. పెళ్లి తర్వాత తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్న నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు మహేష్ బాబు సినిమా విశేషాలతో పాటు కొడుకు గౌతమ్, కూతురు సితారకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటుంది.
Advertisement
అయితే, ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్, నమ్రతల మధ్య కూడా కొన్ని ఒప్పందాలు ఉన్నాయట. మహేష్ నమ్రతకు ఒక కండిషన్ పెడితే ఆమె తిరిగి మహేష్ కి ఒక కండిషన్ పెట్టిందట. పెళ్లి తర్వాత సినిమాలు వదిలేయాలి. గృహిణిగా మారాలని చెప్పారట. అందుకు నమ్రత ఒప్పుకున్నారట. ఇక నమ్రత, మహేష్ కి పెట్టిన కండిషన్ మాత్రం కొంచెం భిన్నమైనది.
Advertisement
పెళ్లయిన వెంటనే ఒక బంగ్లాలో కాపురం చేయడం నావల్ల కాదు. నాకు పరిస్థితులు అలవాటు పడే వరకు మనం ఒక చిన్న అపార్ట్మెంట్ లో నివసిద్దం అన్నారట. మహేష్ సరే అన్నారట. పెళ్లి తర్వాత ఇద్దరు తమ మాట నిలబెట్టుకున్నారు. నమ్రత మరల వెండితెరపై కనిపించలేదు. ఇక మహేష్ జూబ్లీహిల్స్ లో జర్నలిస్టు కాలనీ సమీపంలో గల ఒక అపార్ట్మెంట్ లో కొత్త కాపురం మొదలుపెట్టాడు. చాలా కాలం నమ్రత, మహేష్ దంపతులు అక్కడే ఉన్నారు. సెలబ్రిటీలు ఎవరైనా ప్రశాంతంగా ఇతరులతో సంబంధం లేకుండా విలాసవంతమైన భవంతిలో నివసించేందుకు ఇష్టపడతారు. దానికి భిన్నంగా నమ్రత ఆలోచనలు ఉన్నాయి.
Read also: ఐపీఎల్ లో ఎక్కువ ధరకు అమ్ముడు పోయిన 10 మంది క్రికెటర్లు