Advertisement
ప్రతీ కార్యకర్త పీసీసీ చీఫ్ తో సమానమన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పార్టీలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కోమటిరెడ్డి నల్గొండలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కమీటీల్లో గాంధీభవన్ లో ఉంటూ పైరవీలు చేసుకునే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో పరిణామాలపై దిగ్విజయ్ ను నియమించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు.
Advertisement
కాంగ్రెస్ లో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా డిగ్గీరాజాకు కొన్ని సూచనలు చేశారు. హుజూరాబాద్ లో రేవంత్ ఎందుకు ప్రచారానికి వెళ్లలేదో తేల్చాలన్నారు. మునుగోడులో తనను తిట్టిన ఇష్యూపై విచారణ జరపాలని కోరారు. కమిటీల్లో తాము ఇచ్చిన పేర్లను పట్టించుకోలేదని.. మార్ఫింగ్ వీడియోలపై విచారణ చేయాలని తెలిపారు.
Advertisement
సీనియర్లకు అన్యాయం జరిగిందన్న కోమటిరెడ్డి.. అధిష్టానం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ వచ్చిందన్నారు. దిగ్విజయ్ ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నేత అని కొనియాడారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఆయనకు అవగాహన ఉందన్నారు. కమిటీల్లో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. ఈ విషయంపై ఆయన దృష్టి సారించాలని కోరారు.
ఇక కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు వెంకట్ రెడ్డి. తెలంగాణలో కనీసం మౌలిక సదుపాయాలు లేవన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని.. ఆరోగ్య శ్రీ పనిచేయడం లేదని విమర్శించారు. పక్క రాష్ట్రంలో వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ అమలు అవుతోందని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో స్కూళ్లు మూతపడుతున్నాయని ఆరోపించారు.