Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలామంది నటీనటులు ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇందులో కొంత మంది హీరోయిన్లను హీరోలు పెళ్లి చేసుకోగా… దర్శకులు కూడా హీరోయిన్లను పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. అయితే వీరు పెళ్లి చేసుకోవడమే కాకుండా వారి భార్యల నుంచి భారీగా భరణాన్ని తీసుకున్నారు. అయితే ఈ భారీగా భరణాలు తీసుకున్న జంటలు.. విడాకులు తీసుకున్నవి కూడా ఉన్నాయి మన టాలీవుడ్ లో. అయితే విడాకులు తీసుకున్న జంటల వివరాల్లోకి వెళితే…
Advertisement
1. సంజయ్ కపూర్, కరిష్మా కపూర్ 1990 దశకంలో బాలీవుడ్ ను షేక్ చేసిన హీరోయిన్ కరిష్మా కపూర్. హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో లో కరిష్మా, సంజయ్ కపూర్ నూ పెళ్లాడింది. ఆ తర్వాత ఈ జంట అమెరికాలో స్థిరపడింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే ఆ తర్వాత ఈ జంట విడిపోవాలని నిశ్చయించుకుంది. దాంతో విడాకుల తర్వాత 11 కోట్ల భరణాన్ని సంజయ్ కపూర్ ముట్ట చెప్పాడు. అంతేకాకుండా ఖరీదైన కార్లు మరియు భవనం సైతం కరిష్మా భరణంగా పుచ్చుకుంది.
2.ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తన భార్య రమాలతకు విడాకులు ఇచ్చే సమయంలో భారీ మొత్తంలో భరణం ఇచ్చాడు. నయనతారతో ప్రేమాయణం తర్వాత ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ప్రభుదేవా 25 కోట్ల భరణం తో పాటు రెండు ఖరీదైన కార్లను భార్యకు ఇచ్చాడు.
Advertisement
3. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తన బాల్య స్నేహితురాలు సుశాంత్ ఖాన్ ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ సమయంలో హృతిక్ తన భార్యకు రూ. 5 కోట్ల భరణం తో పాటు తన ఆస్తిలో పిల్లలకు వాటా ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు.
4. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మొదటి భార్య నందినికి రూ. 1 కోటి భరణం గా ఇచ్చాడు. ఆ తర్వాత రేణు దేశాయ్ ని పెళ్లాడిన పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రేణు దేశాయ్ కి కూడా విడాకులు ఇచ్చాడు. విడాకుల సమయంలో పవన్ తన ఇద్దరు పిల్లలకు కోట్ల రూపాయల ఆస్తులను ఇచ్చినట్టు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలను రేణుదేశాయ్ ఖండించింది.
5. సమంత,నాగ చైతన్య లు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సమంతా కూడా భరణం తీసుకునేందుకు నిరాకరించినట్లు ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతోంది.