Advertisement
మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ 2007లో శిరీష్ భరద్వాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్నేళ్ల తర్వాత తన భర్త హెరాస్ చేస్తున్నాడని కేసు పెట్టింది శ్రీజ. ఆ తర్వాత ఆయనతో విడాకులు తీసుకొని 2016లో ప్రైవేట్ సెర్మనీ లో కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకుంది. అమెరికాలో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీకి చెందిన అబ్బాయి కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకోవడం విశేషం. వీరి పెళ్లి అనంతరం కళ్యాణ్ విజేత మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా తర్వాత నటించిన సినిమా సూపర్ మచ్చి.
Advertisement
Read also: బట్టతల ఎందుకు వస్తుంది? పురుషులకే ఎక్కువగా వస్తుంది ఎందుకు?
కన్నడలో క్రేజీ కథానాయకలలో ఒకరైన రచితా రామ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రం తర్వాత కళ్యాణ్ సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు కళ్యాణ్. అయితే గత కొద్ది నెలలుగా కళ్యాణ్, శ్రీజ విడివిడిగా ఉంటున్నారు. శ్రీజ తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి భర్త కళ్యాణ్ పేరుని తొలగించారు. అంతేకాకుండా ఆయనని అన్ ఫాలో చేశారు. ఇక ఇప్పటి నుండి వీరి విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇంతవరకు మెగా ఫ్యామిలీ కానీ కళ్యాణ్ దేవ్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.
Advertisement
ఇక తాజాగా కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తన లేటెస్ట్ ఫోటోని షేర్ చేస్తూ ఈ పోస్ట్ కి ఇచ్చిన క్యాప్షన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. “కాస్త ఓపికగా ఉండండి.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో దీని ఉద్దేశం ఏంటని? ఈ పోస్ట్ వెనుక ఆంతర్యం ఏంటంటూ నేటిజన్లు ఆలోచనలో పడ్డారు. ఈ పోస్ట్ చూసిన వారంతా వీరిద్దరి విడాకుల కోసమే ఈ క్లారిటీ కళ్యాణ్ ఇచ్చారంటూ చెప్పుకొస్తున్నారు. అయితే అసలు విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.
Read also: చాణక్య నీతి: పెళ్లికి ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిని అసలు వదులుకోవద్దు!!