Advertisement
ఈ కాలంలో సైబర్ మోసాలు ఎంతగా పెరిగిపోయాయి అంటే ఎనిమిదో తరగతి చదివిన వ్యక్తి ఏకంగా డజన్ మంది మహిళలను మోసం చేసి లక్షల్లో డబ్బు కాజేశాడు. కాన్పూర్ గ్రాడ్యుయేట్ గా ఫోజులిచ్చి కేవలం మహిళలను మోసం చేయడానికి తనను తాను ఐపీఎస్ అధికారిగా చెప్పుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. వికాస్ గౌతమ్ అనే మధ్యప్రదేశ్ లోని గల్వియర్ నివాసి ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లలో వికాస్ యాదవ్ అనే పేరుతో నకిలీ ఐడి క్రియేట్ చేశాడు. 2021 బ్యాచ్ కి చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ అని సోషల్ మీడియా ప్రొఫైల్ క్రియేట్ చేసి.. ప్రొఫైల్ ఫోటో కూడా ఒక గవర్నమెంట్ కారు పక్కన నిలబడి తీసుకున్న ఫోటోని పెట్టడంతో పలువురు సులభంగా అతని చేతిలో మోసపోయారు.
Advertisement
Read also: అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన తెలుగు సినిమాల లిస్ట్..!
Advertisement
ఢిల్లీలోని ఓ మహిళ డాక్టర్ ఫిర్యాదు మేరకు ఇతని బండారం బయటపడింది. ఐపీఎస్ అధికారిగా నటిస్తూ వికాస్ తన వద్ద 25 వేలు తీసుకున్నాడని ఆమె ఆరోపించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఐపీఎస్ అధికారిగా నటిస్తూ మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే ఆ మహిళ మొదట అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడింది. ఐపీఎస్ అధికారి అని చెప్పడంతో రాజకీయ నాయకుల అండదండ ఉంటుందని భావించి తొలుత వెనక్కి తగ్గి.. ఎట్టకేలకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గౌతమ్ అరెస్ట్ అయ్యాడు. అయితే అతనిని అరెస్టు చేసిన పోలీసులు విచారణలో పలు కీలక విషయాలను రాబట్టారు.
అతను ఇప్పటికే డజన్ మంది మహిళల నుంచి లక్షల్లో డబ్బులు కాజేసినట్లు విచారణలో తేలింది. విచారణలో వికాస్ 8వ తరగతి ఉత్తీర్ణత తరువాత ఢిల్లీకి వెళ్లి ముఖర్జీ నగర్ ప్రాంతంలోని రెస్టారెంట్లో పని చేయడం ప్రారంభించాడని తేలింది. అది సివిల్ కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన ప్రాంతం అని, అక్కడ కోచింగ్ తీసుకునే విద్యార్థులను చూసి వికాస్ ఈ నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తడని చెప్పారు. అతడు గతంలో ఉత్తర ప్రదేశ్, గల్వియర్ లలో పలు ఆరోపణలపై జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు తెలిపారు పోలీసులు.
Read also: బట్టతల ఎందుకు వస్తుంది? పురుషులకే ఎక్కువగా వస్తుంది ఎందుకు?