Advertisement
ఈ రోజుల్లో ఎలాంటి పార్టీ జరిగినా మద్యం ఉండాల్సిందే. స్నేహితులతో సరదాగా మాట్లాడుకోవడానికి తాగే వారు ఉన్నారు. కొత్త కొత్త బంధాలు ఏర్పరచుకోవడానికి తాగుతారు. బంధువులు ఒక్కచోట కలిసిన చాలామంది చేసే పని సిట్టింగ్. మరికొంతమంది తమ పుట్టిన రోజు లాంటి ఏదైనా సంతోషకరమైన సందర్భంలో మద్యం పుచ్చుకుంటారని తెలిసిందే.
Advertisement
మద్యం తాగడం మంచిదా? అంటే టక్కున మంచిది కాదు అంటారు. ఆల్కహాల్ తాగడం అనారోగ్యకరమైనది అనే భావన ఉంది. ఇది ఇలా ఉంచితే, చాలామంది మద్యం సేవించేటప్పుడు వేరుశేనగపప్పు లేదా జీడిపప్పును తినడానికి ఇష్టపడతారు. మద్యం సేవించే సమయంలో పూర్తిగా ఈ పదార్థాలను దూరం పెట్టాలి. మద్యంతో పాటు వీటిని తినడం వల్ల శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వచ్చే సమస్య ఉంది.
Advertisement
అదే విధంగా ఏ విధమైనటువంటి తీపి పదార్థాలను కూడా తినకూడదు. ఇక చాలామంది మద్యంతో పాటు సోడా లే దా కూల్ డ్రింక్ తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల కొన్నిసార్లు నియంత్రణ కోల్పోవలసి వస్తుంది. మద్యంతో పాటు నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. ఇలా నూనెతో తయారుచేసిన పదార్థాలను తినటం వల్ల గ్యాస్ అధికమయ్యి ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అలాగే చిప్స్ కూడా తినకుండా ఉండడం ఎంతో ఉత్తమం. అలాగే పాల ఉత్పత్తులతో తయారైన పదార్థాలు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఏర్పడి అధిక యాసిడిటీని కలిగిస్తుంది. గుండెపోటు కూడా రావచ్చు.