Advertisement
నవరత్నాల్లో ఇది చాలా విలువ కలిగిన రాయి. ఇది అంత ఈజీగా దొరకదు. ఇది ప్రస్తుతం మార్కెట్లో చాలా విలువైన వస్తువు. ఎందుకంటే వజ్రాలతో ఉన్నటువంటి ఆభరణాలను చాలా మంది ధరిస్తారు. అందుకే వీటికి మార్కెట్లో చాలా ధర ఉంటుంది. అసలు ఈ వజ్రాలు ఎలా తయారవుతాయి.. ఎక్కడ నుంచి వస్తాయి. అనేది ఓ సారి చూద్దాం..? భూమి లోపల దాదాపుగా 140 నుంచి 190 కిలోమీటర్ల లోపు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కూరుకుపోయిన పదార్థాలలో కార్బన్ అణువుల నుంచి ఏర్పడతాయి.భూమి లోపల అధిక ఉష్ణోగ్రత కారణంగా వజ్రాలు తయారవుతాయి. ఇవి ఏర్పడటానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది.
Advertisement
ఈ వజ్రం తయారయ్యాక లోపల ఉండే పీడనాన్ని తట్టుకోలేక భూమి యొక్క పైపొరలోకి వస్తుంది. అప్పుడు ఆ ప్రదేశం మీద వర్షాలు పడినప్పుడు, ఆ ప్రాంతంలో నది ఉంటే ఆ నీటి ప్రవాహంలో పడి కొట్టుకు వస్తుంది. అయితే ప్రస్తుతం వజ్రాలను గనుల్లో తరలిస్తున్నారు. బొగ్గు గనుల నుంచి బొగ్గు ఏ విధంగా తీస్తారో వజ్రాలను కూడా అలాగే తీస్తున్నారు. కానీ అవి ముడిపదార్థంగానే ఉంటాయి. దీన్ని అనేక ప్రక్రియలకు గురిచేసి అనంతరం సానబెట్టి అప్పుడు అవి నిజమైన వజ్రంలా మన కంటికి ఇంపుగా మెరుస్తూ ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
Advertisement
ఈ క్రమంలోనే ఎవరు కోరుకున్న సైజుల్లో, డిజైన్లలో వారికి వజ్రాలను అమ్ముతారు. 1867 లో దక్షిణాఫ్రికాలో ఒక నది ప్రవాహంలో కొంతమందికి వజ్రాల దొరికాయట. కాబట్టి అప్పటి నుంచే నదీ ప్రవాహాల్లో వజ్రాల వెతకడం ప్రారంభించారు. అన్ని దేశాల కన్నా మన భారతదేశంలోనే వజ్రాలు ముందుగా దొరికాయట. అసలు వజ్రాలు ఏ పదార్థంతో ఏర్పడతాయో ఇప్పటికీ సైంటిస్టులకు అంతుచిక్కడం లేదు. వజ్రం చాలా కఠినమైన పదార్ధం అంత సులభంగా పగలదు. అసలైన వజ్రానికి రంగు అంటూ ఏమీ ఉండదు. దాని గుండా కాంతిని ప్రసరింపజేసేప్పుడు అన్ని రంగులను అది వెదజల్లుతుంది.
also read;
ఎస్.డి కార్డ్ మీద ఉండే U1, U3, HC సింబల్స్ యొక్క అర్థం ఏంటో మీకు తెలుసా?