Advertisement
ఈమధ్యే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా వచ్చింది. మంచి టాక్ సొంతం చేసుకుంది. గిరిజన బిడ్డల కష్టాలను కళ్లకు కట్టిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలావరకు నడకదారే ఉంటుంది. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా డోలీ కట్టుకుని మోసుకెళ్తుంటారు. కొన్నిచోట్లకు మాత్రమే వాహనాలు వెళ్తుంటాయి. అయితే.. గిరిజన ప్రాంతాల్లో పర్యటించేందుకు గుర్రం ఎక్కారు ఓ ఎమ్మెల్యే.
Advertisement
ఏపీలో గడపగడపకు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాస్త అలసత్వంగా ఉన్న ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టార్గెట్ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యేలు దీన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోకి కూడా వెళ్తున్నారు. అలా.. అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన నియోజకవర్గంలోని ఏజెన్సీ ఏరియాల్లో పర్యటించారు.
Advertisement
రోడ్డు మార్గం లేని ప్రాంతాల్లో గుర్రంపై ప్రయాణించారు ఎమ్మెల్యే. రోలుగుంట మండలం శివారు ఏజెన్సీ ఆర్ల పంచాయితీకి చెందిన లోసంగి పీతురు గడ్డ, పెద్ద గరువు, గుర్రాల బైల, గడప పాలెం గ్రామాలలో గడపగడపకు కార్యక్రమంలో గుర్రంపై పాల్గొన్నారు. ఇంత కష్టపడి వస్తే ప్రజలు మంచిగా రిసీవ్ చేసుకుంటారని ధర్మశ్రీ భావిస్తే.. ఆయనకు షాకిచ్చారు గిరిజనులు.
తమ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యేని నిలదీశారు. తమ దగ్గర గుర్రాలు లేవని.. ఇక్కడ రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నామని వాపోయారు. వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అన్నీ నెరవేరుస్తామని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు ధర్మశ్రీ.