Advertisement
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించారు. అయితే, రీసెంట్ గా విడుదలైన ‘ధమాకా’ సినిమాలో ఏపీ సర్కార్ కి స్ట్రాంగ్ గా తగిలేలా ఒక పంచ్ పడింది. కాకపోతే ఆ పంచ్ వేసింది హీరో రవితేజ కాదు, కమెడియన్ హైపర్ ఆది. సినిమాలో రావు రమేష్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తుంటాడు ఆది.
Advertisement
పేరుకి డ్రైవర్ అయినప్పటికీ, తన ఓనర్ మీద పంచులు వేస్తుంటాడు. ఆ డ్రైవర్ వచ్చాక తనకు కలిసి వచ్చిందనే కారణంతో అతడు ఏమన్నా, పడుతుంటాడు రావు రమేష్. సినిమాలో ఒక సన్నివేశంలో రావు రమేష్ రవితేజను చంపించడానికి రౌడీలను పెడతాడు. పదే పదే వాళ్లకు ఫోన్ చేసి వాడిని వేశారా? లేదా? అని అడుగుతుంటాడు. దానికి అది, ‘బాబోయ్ అప్పటినుంచి వేసారా లేదా వేసారా లేదా అంటున్నారు.
Advertisement
ఒకటో తారీకు వచ్చింది నా శాలరీ వేసారా? లేదా?’ అంటూ పంచ్ వేస్తాడు. కావాలనే ఈ డైలాగ్ రాశారా? లేక ఫ్లోలో రాసుకున్నారో తెలియదు కానీ, ఈ పంచ్ జగన్ సర్కార్ కి తగిలేలా ఉంది. ఏపీలో ఉద్యోగులకి టైంకి జీతాలు పడడం లేదు. నెల మధ్యలోకి వచ్చిన జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకీ ఈ పరిస్థితి దిగజారుతుండడంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో సినిమాలో ఆ డైలాగు జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాశారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Read also: కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?