Advertisement
ఆపరేషన్ సౌత్ మొదలుపెట్టిన బీజేపీ.. తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టింది. విస్తారక్ సమావేశాల్లో భాగంగా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. రెండు రోజులపాటు సాగిన సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా.. సౌత్ లో లోక్ సభ స్థానాల్లో గెలుపే టార్గెట్ గా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే మరోసారి తెలంగాణ పర్యటన పెట్టుకున్నారు ప్రధాని మోడీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ టూర్ పై కీలక అప్డేట్ ఇచ్చారు.
Advertisement
శామీర్ పేట లియోనియా రిసార్ట్స్ లో రెండు రోజుల పాటు నిర్వహించిన పార్లమెంట్ విస్తారక్ ల శిక్షణా తరగతుల ముగింపు అనంతరం మీడియాతో మాట్లాడారు బండి. ప్రధాని మోడీ ఫిబ్రవరిలో తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలిపారు. బూత్ కమిటీ సమ్మేళనంలో మోడీ పాల్గొంటారని వెల్లడించారు. ఈ సమ్మేళనంలో హాజరుకావాలని ప్రధానికి రిక్వెస్ట్ పంపించినట్లు వివరించారు. ఇక కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు సంజయ్. కేసీఆర్ పార్టీలో తెలంగాణ లేదని.. ఉద్యమం పేరుతో కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు.
Advertisement
బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేయడానికి సొంత పార్టీ నేతలే సిద్ధంగా లేరని ఎద్దేవ చేశారు బండి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కేసీఆర్ డబ్బులు పంపుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. 90 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. బీజేపీకి ప్రతి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులున్నారని చెప్పారు.
బీజేపీకి అభ్యర్థులు లేరనేది ఒక వర్గం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు సంజయ్. తెలంగాణలో నాలుగంచెల వ్యూహంతో ముందుకు వెళతామని స్పష్టం చేశారు. బీఎల్ సంతోష్ హైదరాబాద్ రావటానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదన్నారు.