Advertisement
మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పాపులారిటీ అంతా కాదు. ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా మరి కొంతమంది కష్టపడి పైకి వచ్చారు. ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో.. చాలామంది మిత్రులు అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు. అయితే వారసత్వంతో ఎంట్రీ ఇచ్చినా, టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎదగ లేకపోయిన హీరోలు కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
# సుమంత్, సుప్రియ:
అక్కినేని నాగేశ్వరరావు మనవడు మనవరాలు అయిన సుమంత్ సుప్రియ ఇద్దరు వారసత్వంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సుమంత్ సత్యం మూవీ హిట్ కాగా, సుప్రియ నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి యావరేజ్ గా ఆడింది. దీనితో వీరిద్దరూ తెరమరుగయ్యారు.
# మంచు విష్ణు, మనోజ్:
మోహన్ బాబు వారసత్వంగా వచ్చిన మనోజ్ విష్ణులు తమ కెరీర్ ఇంకా ట్రాక్ లోకి రాలేదని చెప్పాలి. విష్ణుకు ఢీ సినిమాతో హిట్ వచ్చిన దానిని అలానే కంటిన్యూ చేయలేకపోయారు. తమ్ముడు మనోజ్ నటించిన దొంగ దొంగది, బిందాస్ లాంటి సినిమాలో పేరు తెచ్చినప్పటికీ సూపర్ హిట్ లేకపోవడంతో ఇంకా తన కెరియర్ ఆగమ్యగోచరంగా తయారైంది.
Advertisement
# అరుణ్, తరుణ్:
అలనాటి హీరోయిన్ రోజా రమణి కొడుకు తరుణ్ సూపర్ డూపర్ హిట్ నువ్వే కావాలి సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన విజయాన్ని సుస్థిరం చేసుకోలేకపోయారు. అగ్ర దర్శకుడు దాసరి నారాయణరావు కొడుకు అరుణ్ కుమార్ గ్రీకువీరుడుతో తెరంగేట్రం చేసినప్పటికీ తాను నటించిన సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర నిరాశను కలిగించాయి.
# గౌతమ్, విక్రమ్:
వీరిద్దరూ కూడా ప్రముఖ హాస్య నటుల కొడుకులు అయినప్పటికీ వీరి కెరీర్ కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. బ్రహ్మానందం కొడుకు గౌతమ్ నటించిన పల్లకిలో పెళ్లికూతురు యావరేజ్ గా ఆడింది. మరో హాస్యనటుడు అయినా ఎం ఎస్ నారాయణ దర్శకత్వం వహించిన కొడుకు అనే సినిమా ఫెయిల్యూర్ కావడంతో విక్రమ్ భవిష్యత్తు కూడా ఆగమ్య గోచరంగా తయారైంది.
# నాగేంద్రబాబు, రమేష్ బాబు:
అన్న చిరంజీవి హీరోగా నటించిన రాక్షసుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగబాబు 420, అగ్రిమెంట్ లాంటి సినిమాల్లో హీరోగా కనిపించినప్పటికీ అంతగా సక్సెస్ కాలేకపోయారు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంగా టైగర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా రమేష్ బాబు ఒకటి రెండు హిట్ సినిమాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
Read also: ఆగిపోయిన హీరో ఆర్యన్ రాజేష్ పెళ్లి చలపతి రావు గారు ఎందుకు చేసారు ?