Advertisement
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మనకు టాయిలెట్లు రెండు రకాలుగా కనిపిస్తాయి. ఒకటి ఇండియన్ టైప్. రెండోది వెస్ట్రన్ టైప్. విదేశాల్లో చాలా దేశాల్లో వెస్ట్రన్ టైప్ టాయిలెట్లను ఉపయోగిస్తారు. ఇక మన దేశంలో చాలామంది ఇండియన్ తరహా టాయిలెట్లను వాడుతారు. కొందరు ఇళ్లలో వెస్ట్రన్ టాయిలెట్లు ఉంటాయి. అయితే ఏ టాయిలెట్ సీట్ అయినా సరే దాదాపుగా తెలుపు రంగులోనే ఉంటుంది. అవును..గమనించారు కదా. అయితే షాపింగ్ మాల్స్ లో టాయిలెట్స్ కింది భాగంలో ఖాళీగా ఉంటుంది. అయితే ఆ టాయిలెట్స్ కింది భాగంలో ఎందుకు అలా ఖాళీగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు మాల్స్ మరియు ఆఫీసులలో టాయిలెట్ తలుపులు దిగువ భాగంలో ఓపెన్ గా ఉంటాయి. అయితే ఇలా ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. టాయిలెట్ తలుపులు చిన్నగా ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న టాయిలెట్ తలుపులు కలిగి ఉండటం మొదటి, ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే అవి మన్నికైనవి. టాయిలెట్లను శుభ్రం చేయడం సులభంగా ఉంటుంది.చిన్న టాయిలెట్ తలుపుల ప్రయోజనాలు కేవలం నిర్వహణ లేదా మన్నికకు మాత్రమే పరిమితం కాదు. టాయిలెట్ ఉపయోగించే వ్యక్తి ఏదైనా ఆకస్మిక ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నట్లయితే, అది సులభంగా తెలుస్తుంది.
Advertisement
తద్వారా తలుపును తెరిచి ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని కాపాడే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కొంతమంది టాయిలెట్లలో శృ^^^ ర కార్యకలాపాలు చేస్తుంటారు.ఇలాంటి వాటిని అరికట్టడానికి టాయిలెట్ డోర్ కింది భాగం తెరిచి ఉంటే ఉపయోగపడుతుంది. ఇతరులు చూస్తారనే భయంతో అలాంటి పనులు ఎవరూ చేయరు. దీంతో పాటు టాయిలెట్ లో ఎవరైనా ఉంటే బయటి వారికి తెలుస్తుంది. వారు మరో టాయిలెట్లోకి వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. మరుగుదొడ్ల లోపల ధూమపానం చేసే అలవాటు కొందరికి ఉంటుంది. పూర్తిగా మూసి ఉన్న టాయిలెట్లలో ధూమపానం చేయడం ప్రమాదకరం. అలాంటి వాటిలో ఎవరు ధూమపానం చేస్తున్నారో తెలుసుకోవడం కష్టం. అయితే కింది భాగంలో తెరిచి ఉన్న టాయిలెట్లలో ధూమపానం ఎవరు చేసినా వెంటనే తెలుస్తుంది.
Read also: ప్రభాస్ ఎందుకు హెయిర్ క్యాప్ పెడుతున్నాడు..?