Advertisement
చిత్ర పరిశ్రమలో సినిమాకు ఒక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న రోజులివి. ఈ జనరేషన్ లో పదేళ్ల కెరీర్ కొనసాగించడం ఏ హీరోయిన్ కి అయినా కత్తి మీద సాము లాంటిది. అలాంటిది అంతకంటే పెద్ద మ్యాజిక్ చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ఈ చెన్నై చంద్రం నటించిన తొలి సినిమా నీ మనసు నాకు తెలుసు. కానీ ఈ సినిమా స్ట్రైట్ తెలుగు సినిమా కాదు. ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో ఆమె తెలుగులోకి పరిచయం అయింది. ఇక వర్షం సినిమా ఎంత పెద్ద ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో త్రిష వెనుతిరిగి చూడలేదు.
Advertisement
Read also: కమల్ టు ఎన్టీఆర్.. మొదటి సినిమాకి ఈ 10 మంది సార్లు తీసుకున్న పారితోషికాల లిస్ట్..!
వరుస హిట్లు ఆమె కెరీర్ లో పడ్డాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇక్కడ బిజీగా మారిపోయింది త్రిష. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. తమిళ్ ఇండస్ట్రీ లోను ఈ బ్యూటీ మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ విషయాలు పక్కన పెడితే త్రిష తన కెరీర్ లో చాలామంది నటులతో నటించింది. అయితే తన కెరీర్ లో తన సినిమాలలో త్రిషకు తండ్రిగా, మామగా, బాయ్ ఫ్రెండ్ గా నటించిన నటుడు ఎవరో తెలుసా? ఆయన ఎవరో కాదు వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్. 2004 లో ప్రభాస్ హీరోగా శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన వర్షం చిత్రం త్రిష కి తొలి సినిమా.
Advertisement
ఈ చిత్రంలో త్రిష కి తండ్రిగా నటించాడు ప్రకాష్ రాజ్. ఆ తర్వాత వచ్చిన ఆకాశమంత, ఇక ఇటీవల వచ్చిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ పొన్నియన్ సెల్వన్ చిత్రంలో కూడా ప్రకాష్, త్రిష కు తండ్రిగా నటించాడు. అలాగే ప్రభుదేవా దర్శకత్వంలో సిద్ధార్థ హీరోగా వచ్చిన నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమాలో హీరో సిద్ధార్థ్ కి తండ్రిగా నటించాడు ప్రకాష్ రాజ్. అంటే ఆ చిత్రంలో త్రిషకు మామగారిగా నటించారు. అలాగే మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా తమిళ్ రీమేక్ “గిల్లి” లో త్రిషకి బాయ్ ఫ్రెండ్ గా నటించాడు ప్రకాష్ రాజ్. ఇక ప్రస్తుతం త్రిష పోన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో నటిస్తోంది.