Advertisement
ముఖ్యంగా వర్షాకాలం మొదలయ్యే మొదటి రోజుల్లో మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న మిణుగురు పురుగులు తళతళ మెరుస్తూ లైట్ లాగా కనిపిస్తాయి. ఆ లైటు ఒక్కోసారి వస్తూ పోతూ మనకు కనిపిస్తుంది. అసలు వీటిపై లైట్ ఎలా వెలుగుతుంది అనే విషయాన్ని చాలా మంది ఆలోచించే ఉంటారు కానీ ఎవరికీ తెలియదు.
Advertisement
మిణుగురు పురుగు కడుపు దిగువ భాగంలో ఉండే ప్రత్యేకమైన అవయవం నుండి పసుపు రంగు కాంతిని విడుదల చేస్తూ ఉంటుంది. ఈ అవయవాల్లో లూసిఫెరిన్ అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనం ఆక్సిజన్ తో కలిసి ఆక్సీకరణం చెంది మెరుపులా కాంతిని విడుదల చేస్తుంది. ఈ యొక్క రసాయన చర్యల్లో ఉష్ణం కూడా విడుదలవుతుంది. కాంతిని పుట్టించే వాటిలో లూసిఫెరిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ రసాయన చర్యను ప్రేరేపించే ప్రేరకంగా పనిచేస్తుంది.
Advertisement
ఇది గాలిలోని ఆక్సిజన్ ను తీసుకొని ఆ గాలిలో కాంతిని పుట్టించి అవయవాల్లోకి ప్రవేశింప చేస్తుంది. ఈ మినుగురులను లయబద్దంగా ఏర్పరుస్తుంది. ఇందులో ఒక్కొక్క జాతి మిణుగురు పురుగు ఒక్కో విధంగా కాంతిని లైట్ గా వేదజల్లుతుంది. ఈ విధంగా మిణుగురు పురుగులు గాల్లో ఎగురుతూ అన్నీ గుంపుగా లైట్లను వెలిగిస్తూ అందంగా కనిపిస్తూ ఉంటాయి.
also read;
రాత్రిపూట గోర్లు కట్ చేయకూడదని పెద్దలు అంటారు.. కారణమేంటో తెలుసా..?