Advertisement
బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటివరకు జరుగుతూ వచ్చాయి. బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు మరియు తల్లి పోతులూరి ప్రకృతాంబ. బ్రహ్మంగారికి చిన్న వయసులోనే విశేష జ్ఞానం లభించింది. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం, వినడం మనకు పరిపాటే.
Advertisement
Read also: షాపింగ్ మాల్స్ లోన టాయిలెట్స్ కింద భాగంలో ఖాళీగా ఎందుకు ఉంటాయి ? దానికి కారణం ఏంటి ?
Advertisement
ఆయన చెప్పిన విషయాలలో ఎన్నో జరిగాయి కూడా. ఇంకా ఆయన చెప్పిన విషయాలలో జరగాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటే భయం కలుగుగక మానదు. అలా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం లో జరగబోయే రోజుల్లో జరిగే విషయాలు తెలుసుకుందాం. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ” కోరంకియగు ఒక జబ్బు వచ్చే నయా.. కోట్ల మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ” అంటూ పేర్కొన్నారు. ఆయన చెప్పిన విధంగానే 2020లో కరోనా బారిన పడి ఎంతోమంది మరణిస్తున్నారు. అయితే ఈ మహమ్మారి అంత సులువుగా వదిలిపెట్టదని అది మళ్ళీ వచ్చి ఎంతోమంది ప్రాణాలను తీసుకుంటుందని చెప్పారు. దుర్మార్గులు రాజులవుతారు, మంచి ప్రవర్తన గలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారని చెప్పారు. అలాగే మతకలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారని కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మం గారు.
అడవి మృగాలు గ్రామాలు, పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయని చెప్పారు. 2028 నాటికి ఇండియా ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మారుతుందని చెప్పారు. ఇక 2032 నాటికి ప్రపంచంలో ప్రకృతి వినాశనాలు, యుద్ధాలు జరిగి అల్లకల్లోలం జరుగుతుందని కాలజ్ఞానంలో తెలిపారు. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువు అవుతాయన్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులతో మాట్లాడతాడని, దొంగ స్వాములు పుట్టుకొస్తారంటూ చెప్పారు. ఇలా కాలజ్ఞానం లో ఎన్నో విషయాలను తెలిపారు బ్రహ్మంగారు.
Read also: జీన్స్ ప్యాంట్ల పై ఉండే చిన్న పాకెట్స్ ఎందుకు ఉంటాయంటే ?