Advertisement
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. 2022లో ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో సందడి చేశారు. ఇక 2023 జనవరి 13న వాల్తేరు వీరయ్యతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు మెగాస్టార్. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ బాబి రూపొందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
Advertisement
Read also: లైఫ్లో ఇంపార్టెంట్ వ్యక్తిని కలిశానంటున్న శ్రీజ.. మెగా డాటర్ పోస్ట్ వైరల్
Advertisement
ఈ చిత్రంలోని పాటలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని “డోంట్ స్టాప్ డాన్సింగ్.. పూనకాలు లోడింగ్” పాటని సంధ్య 70 ఎంఎం లో గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. పాటకి తగ్గట్టుగానే మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది ఈ సాంగ్. రోల్ రిడా పూనకాలు తెప్పించే లిరిక్స్ అందించడంతోపాటు రామ్ మిర్యాలతో కలిసి ఫుల్ ఎనర్జిటిక్ గా పాడారు. అలాగే చిరంజీవి – రవితేజ తమ డైనమిక్ వాయిస్ తో ” డోంట్ స్టాప్ డాన్సింగ్.. పూనకాలు లోడింగ్” అనడం పూనకాలని రెట్టింపు చేసింది.
అయితే ఈ పాటలో చిరంజీవి వేసిన షర్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పాటలో చిరంజీవి ఎరుపు రంగు పూల చొక్కా ధరించి మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. అయితే ఆ షర్ట్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ఓ సంబంధం ఉంది. రామ్ చరణ్ కూడా సేమ్ అలాంటి షర్ట్ ధరించి ఓ యాడ్ లో కనిపించారు. అయితే చిరంజీవి వేసిన షర్ట్ చరణ్ దే అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా మెగా హీరోలు ఒకేలాంటి డిజైన్ ఉన్న షర్టులో కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందంగా ఫీల్ అవుతున్నారు.
Read also: ఆ హీరోతో ప్రేయసిగా చేసి ఇప్పుడు వదినగా నటిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?