Advertisement
మన దేశంలో అన్ని రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆర్మీలో పనిచేసే వారిలో ఎక్కువగా పంజాబీ వాసుల పేర్లే వినిపిస్తూ ఉంటాయి. సిపాయి నుండి బ్రిగేడియర్ స్థాయి వరకు మిలటరీలో వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో చేరడాన్ని పంజాబ్ వాసులు గర్వంగా ఫీల్ అవుతారు. వాళ్ల తల్లిదండ్రులు కూడా మా కొడుకు ఆర్మీలో ఉన్నాడు అని గర్వంగా చెప్పుకుంటారు. అయితే వారికి చిన్నప్పటినుండి ఆర్మీ మీద అవగాహన ఉండడం.. శారీరకంగా బలంగా ఉండడం కూడా పంజాబ్ వాసులు ఆర్మీలో ఉండడానికి ఓ కారణం. వాస్తవానికి ఇండియన్ ఆర్మీలో పంజాబ్ నాలుగవ స్థానంలో ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది. కానీ జనాభా దృశ్యా చూస్తే చిన్న రాష్ట్రమైన పంజాబ్ నుండి 11.7 % మంది ఇండియన్ ఆర్మీ లో ఉన్నారు.
Advertisement
Read also: ఆ హీరోతో ప్రేయసిగా చేసి ఇప్పుడు వదినగా నటిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
Advertisement
దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ దేశ జనాభాలో 14 % మంది మాత్రమే ఇండియన్ ఆర్మీ లో ఉన్నారు. అయితే మనకి పంజాబ్ వారే ఇండియన్ ఆర్మీలో ఎక్కువగా ఉన్నట్లు అనిపించడానికి కారణం ఏమిటంటే.. సింగ్ పేరుతో ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో కూడా కొన్ని ఇంటి పేర్లు ఉండడంతో.. ఆర్మీలో మనకు ఎక్కువగా వినిపించే సింగ్ పదాన్ని బట్టి మనం వారిని పంజాబ్ లెక్కలో వేస్తాం. అలా ఇండియన్ ఆర్మీలో పంజాబ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు అన్నదానికి ఇది కూడా ఓ కారణం అయి ఉండొచ్చు. కానీ సిక్కులకు దేశభక్తి ఎక్కువ అనేది మాత్రం అందరం అంగీకరించాల్సిన అంశం. అయితే ఏ రాష్ట్రం నుండి ఇండియన్ ఆర్మీ లో ఎంత శాతం ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
1) ఉత్తరప్రదేశ్ నుండి 14%
2) మహారాష్ట్ర నుండి 13.4%
3) తమిళనాడు నుండి 12%
4) పంజాబ్ నుండి 11.7%
5) హర్యానా నుండి 11%
Read also: ఉదయ్ కిరణ్ సోదరి టాలీవుడ్ టాప్ సింగర్..!! ఆమె ఎవరో మీకు తెలుసా..?