Advertisement
శతాబ్దాల క్రితం నిర్మించిన శివాలయాలు, శివలింగాలు, పురాతన వస్తువులు తవ్వుతున్నాకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. అయితే పూర్వం శివుడిని విగ్రహ రూపంలోనే పూజించేవారు. వరాహ పురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో బృగు మహర్షి శాప ఘట్టంలో భృగు మహర్షి శివుడిని ” నేటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలు ఉండవు. నీ ప్రసాదం నింద్యం అవుతుంది ” అని శపిస్తాడు. అంటే అంతకు ముందు విగ్రహానికి పూజలు ఉండేవన్నమాట. శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే.
Advertisement
Read also: ఉదయ్ కిరణ్ సోదరి టాలీవుడ్ టాప్ సింగర్..!! ఆమె ఎవరో మీకు తెలుసా..?
ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటిదాకా ఎవరూ కచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది. లింగం అంటే సంకేతం అని అర్థం. అలా శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అనేక దేశాలలో పురాతన స్థలాల తవ్వకాలలో హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. అలా వియత్నం లోని మైసన్ శాంన్చ్చు వరి లో ఉన్న చామ్ టెంపుల్ కాంప్లెక్స్ లో అక్కడి అధికారులతో కలిసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాలలో 1100 ఏళ్ల కిందటి శివలింగం బయటపడింది. ఆ శివలింగం 9వ శతాబ్దం కాలం నాటికి చెందినదని సైంటిస్టులు తెలిపారు.
Advertisement
4వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం మధ్య “మధ్య వియత్నం లోని కువాంగ్ ప్రావిన్స్” లో ఉన్న మై సన్ శాంక్చవరి లో చంపా సామ్రాజ్యానికి చెందిన రాజులూ పలు హిందూ ఆలయాలను నిర్మించారు. ఆ ఆలయాల ప్రాంగణంలో తవ్వకాలు జరపగా ఈ శివలింగం బయటపడింది. ఆ శివలింగం ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. అయితే 2018 లోనే భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మై సన్ శాంచువారిని సందర్శించారు. అక్కడి పురాతన హిందూ ఆలయాల స్థలాన్ని పరిరక్షించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. ఇక అదే ఆలయ కాంప్లెక్స్ లో మరో 6 శివలింగాలు కూడా తవ్వకాలలో బయటపడ్డాయి.
Read also: మహిళల దుస్తులలో బటన్లు ఎడమవైపు, మగవారికి కుడివైపు ఎందుకు ఉంటాయో తెలుసా ?