Advertisement
కళ్యాణమొచ్చిన కక్కొచ్చిన ఆగదంటారు పెద్దలు.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే మంచిదని అంటూ ఉంటారు.. సాధారణ ప్రజలు అయితే పెళ్లి విషయంలో కాస్త ముందుగానే ఆలోచించినా ఇండస్ట్రీలో ఉండేవారు మాత్రం నాలుగు పదుల వయసు వచ్చినా పెళ్లి విషయం ఆలోచించరు. అయితే, మన టాలీవుడ్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న భామలు కూడా ఉన్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
# సావిత్రి:
తిరుగులేని నటిగా, మహానటిగా దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలిన సావిత్రి, కెరియర్ పీక్స్ లో ఉండగానే అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలు ఉన్న జెమినీ గణేషన్ ను రహస్యంగా పెళ్లాడి అభిమానులకు, చిత్ర పరిశ్రమకు షాకిచ్చారు.
# జయప్రద:
తెలుగు ఇంటి ఆడపడుచుగా దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటిన జయప్రద సైతం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ నహతాని ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆయనకు పెళ్లయి, పిల్లలు ఉండడంతో తమ వివాహ విషయాన్ని బయటకు చెప్పలేదు జయప్రద.
#శ్రీదేవి:
అందాల తార శ్రీదేవి రెండు సార్లు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలినాళ్లలో అప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తిని ప్రేమించి ఆయనను రహస్యంగా పెళ్లాడారు. అయితే మూడేళ్లకే వీరి పెళ్లి పెటాకులైంది. బోనీ కపూర్ ని ప్రేమించిన శ్రీదేవి అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
# దేవయాని:
సుస్వాగతం లో పవన్ కళ్యాణ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత దక్షిణాదిలో గుర్తుండిపోయే పాత్రలు చేసిన దేవయాని, రాజకుమార్ అనే దర్శకుడితో ప్రేమలో పడ్డారు. అయితే ఈ విషయం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. దీంతో కోరుకున్న వ్యక్తి కోసం కుటుంబ సభ్యుల మాటను కాదని ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు దేవయాని.
Advertisement
# అనన్య:
సినిమాల్లో జరిగినట్లు లేచిపోయి పెళ్లి చేసుకున్న మరో నటి అనన్య. ఈ మలయాళ కుట్టి, ఆంజనేయులు అనే వ్యక్తిని ప్రేమించే పారిపోయి వివాహం చేసుకున్నారు.
# సీత:
ముద్దుల మావయ్యలో బాలకృష్ణ చెల్లెలిగా నటించి తెలుగు ప్రజల అభిమానం పొందిన సీత, తర్వాత హీరోయిన్ గా కోలీవుడ్ లో సత్తా చాటారు. ఈ క్రమంలో తమిళ నటుడు పార్దిబన్ ని ప్రేమించారు. కానీ వీరు కాపురం సజావుగా సాగలేదు. పెళ్లయిన కొన్నాళ్లకే ఈ జంట విడిపోయింది. తర్వాత సీరియల్ నటుడు సతీష్ ని 2010లో ఎవరికీ చెప్పకుండా రెండో వివాహం చేసుకున్నారు.
# సాత్నా టైటస్:
బిచ్చగాడు సినిమాలో విజయ్ ఆంటోనీతో సమానంగా నటించి సెంటిమెంట్ పండించిన మలయాళ నటి సాత్నా టైటస్ కూడా లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. బిచ్చగాడు సినిమాకు బయ్యర్ గా ఉన్న కార్తీక్ ని ప్రేమించి అతని కోసం ఇంతటి సాహసం చేశారు.
# శ్రియ శరన్:
పెళ్లి, ప్రేమ, పిల్లలు విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి మొత్తం పరిశ్రమకే షాక్ ఇచ్చారు శ్రియ శరన్. రష్యాకి చెందిన అండ్రి కోషీవుని ప్రేమించిన విషయం గాని, పెళ్లి చేసుకున్న విషయం గాని, చివరికి సంతానం విషయం గాని బయటకు తెలియనీయకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత తీరిగ్గా విషయం చెప్పడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు.
# రమ్యకృష్ణ:
నవరసాలను అద్భుతంగా పలకించె నేటితరం నటిమనుల్ని వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అలాంటి వారిలో ఒకరు రమ్యకృష్ణ. అందం, అభినయంతో దక్షిణాదిని ఏలిన ఆమె హీరోలతో సమానంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీతో ఉన్న పరిచయం, ప్రేమగా మారింది. కొన్నేళ్లపాటు నడిచిన ప్రేమాయణానికి ఈ జంట 2003లో శుభం కార్డు వేసింది. వీరి పెళ్లికూడా నలుగురికి తెలియకుండా రహస్యంగా ఒక గుడిలో జరిగింది.
Read also: పర్ఫ్యూమ్ కి, డియోడ్రంట్ కి మధ్య తేడా ఏంటో తెలుసా?