Advertisement
Srija Konidela : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి తెలియని వారు ఉండరు. శ్రీజ సినిమాలలో నటించకపోయినప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో నెలకొన్న పరిస్థితుల దృశ్య తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మొదట ఓ వ్యక్తిని ప్రేమించి ఇంట్లో వాళ్లకి చెప్పకుండా అతనితో పారిపోయి పెళ్లి చేసుకున్న శ్రీజ.. కొన్నాళ్లకే మొదటి భర్తతో విడిపోయింది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహం చేసుకుంది. ఇక ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారని.. త్వరలోనే శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Advertisement
Read also: జయం సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ కూతురిని చూడండి.. ఎంత క్యూట్ ఉందో…!
Advertisement
నూతన సంవత్సరం సందర్భంగా శ్రీజ పెట్టిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. శ్రీజా కి పబ్లిక్ గా ఓ వ్యక్తి ఐ లవ్ యు చెప్పారట. అతనెవరో కాదు స్టైలిస్ట్ ప్రీతమ్ జుక్కల్కర్. ఇతను ఎవరో చాలామందికి ఎక్కువగా తెలియకపోవచ్చు. టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య – సమంత విడాకులకు ముందు వరకు ప్రీతమ్ జుకాల్కర్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. కానీ వారి విడాకుల ప్రకటన అనంతరం ఈ పేరు మీడియాలో, సోషల్ మీడియాలో మారుమోగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్, సమంత తో పాటు ఇతర హీరోయిన్లకు ఫ్యాషన్ డిజైనర్. ప్రీతమ్ కేవలం సమంతకే కాదు.. రకుల్, రాశిఖన్నాలకి కూడా ఇతనే స్టైలిస్ట్ గా ఉంటున్నాడు. కాటన్ వస్త్రాలకు సంబంధించి ఫ్యాషన్ గార్మెంట్స్ ను తయారు చేయడంలో ప్రీతమ్ కి మంచి పేరుంది. అప్పట్లో సమంతతో క్లోజ్ గా ఉంటాడు అని, వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని వైరల్ అయింది.
అప్పటినుండి ఇతడు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. అయితే తాజాగా ఇప్పుడు మెగా డాటర్ శ్రీజా ని కూడా వదలలేదు. ఆమెకి ఐ లవ్ యు కూడా చెప్పేశాడు. శ్రీజ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోని పంచుకుంది శ్రీజ. ఆ వీడియోలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కొన్ని విషయాలను పంచుకుంది. ఈ వీడియో చూసిన ప్రీతమ్ ఐ లవ్ యు అంటూ లవ్ సింబల్ తో స్పందించాడు. ఇక ఈ విషయం తెలిసిన చాలామంది నేటిజన్స్ వీరిద్దరి మధ్య కూడా ఏదైనా నడుస్తుందా..? అందుకే ప్రీతమ్ అలా లవ్ సింబల్ పెట్టారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read also: ఆడపడుచు చేత పెళ్ళికొడుకుని ఎందుకు చేయిస్తారు..?