Advertisement
ఎవరైనా ప్రముఖులు అమరులైనప్పుడు సాధారణంగా వారికి సంతాప సూచకంగా రెండు నిమిషాల మౌనం పాటించడం చూస్తూనే ఉంటాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. గాంధీ వంటి స్వతంత్ర సమరయోధులు, ఇతర ప్రముఖుల జయంతులు, వర్ధంతులకు మౌనం పాటిస్తూ ఉంటారు. అయితే ఈ మౌనం పాటించడానికి కారణం ఏమిటి? అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కాన్సెప్ట్ ఎవరిది అనే విషయాలు తెలుసుకుందాం. సుమారు 300 ఏళ్ల కిందట సౌత్ ఆఫ్రికాలోని కెప్టెన్ క్రిస్టియన్ ఉద్యమం జరిగినప్పుడు ఈ సాంప్రదాయం ప్రారంభమైంది.
Advertisement
Read also: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేక నష్టాలని మిగిల్చిన సినిమాలు !
Advertisement
అప్పట్లో ఈ ఉద్యమంలో చనిపోయిన వారి త్యాగానికి గుర్తుగా వారిని స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించేవారు. ఇక మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సర్ పెర్షి ఫిట్జ్ ప్యాట్రిక్ ఒకసారి కింగ్ జార్జ్ వి కి మౌనం పాటించడం పై సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన కామన్వెల్త్ రిమెంబరెన్స్ డేస్ ఉత్సవాలు జరుపుకోవాలని ప్రారంభించారు. అలా కింగ్ జార్జ్ ఆదేశాల మేరకు అమర జవాన్ల త్యాగానికి గుర్తుగా వారిని స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించడం మొదలుపెట్టారు. అలా ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. అప్పటినుండి అనేక దేశాలు ఈ పద్ధతిని అనుసరించడం మొదలుపెట్టాయి.
అయితే ఏదైనా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఆయా దేశాలు శాంతి చర్చలతో యుద్ధాన్ని ముగిస్తే అప్పుడు ఆ దేశాలు కూడా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలనే కొత్త సిద్ధాంతాన్ని ఆస్ట్రేలియాకు చెందిన జర్నలిస్టు ఎడ్వార్డు జార్జ్ హని సూచించాడు. కానీ ఈ సిద్ధాంతాన్ని ఎవరూ పాటించలేదు. కాకపోతే సొంత దేశానికి చెందిన జవాన్లు యుద్ధంలో చనిపోతే వారికోసం రెండు నిమిషాలు మౌనం పాటించడం మొదలుపెట్టారు. ఇక చనిపోయిన వారు ప్రముఖులు అయితే వారికి గౌరవ సూచకంగా కూడా రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు.
Read also: PAWAN KALYAN MOVIES: పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్స్ !