Advertisement
తెలంగాణ బీజేపీ మిషన్ 90 అంటోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యమని చెబుతోంది. అనుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. ఈక్రమంలోనే అన్ని శాఖలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. అలాగే.. బీజేపీ పెద్దలను వీలు చిక్కినప్పుడల్లా నగరానికి తీసుకొస్తోంది. అయితే.. ప్రధాని మోడీ మరోసారి హైదరాబాద్ రానున్నారు. ఆయన వచ్చేది అఫీషియల్ గవర్నమెంట్ ప్రోగ్రాంకే అయినా.. రాష్ట్ర బీజేపీ నేతలు దాన్ని కూడా క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు.
Advertisement
మామూలుగా ప్రధాని హైదరాబాద్ వస్తే.. బీజేపీ నేతలు స్వాగతం చెబుతుంటారు. ఎయిర్ పోర్టు దగ్గరే మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అక్కడే పార్టీకి సంబంధించి మోడీ మాట్లాడతారు. ఇతర పార్టీలను తిట్టి వెళ్లిపోతారు. ఇప్పుడు మోడీ రాక సందర్భంగా బీజేపీ మీటింగ్ ఉంటుందా? లేదా? అనేది క్లారిటీ లేదు. అయితే.. కమలనాథులు మాత్రం ఉండేలా చూసుకుంటున్నారని టాక్.
Advertisement
సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా విజయవాడకు వందేభారత్ రైలు నడవనుంది. జనవరి 19న ప్రధాని మోడీ సికింద్రాబాద్ లో దీన్ని ప్రారంభించనున్నారు. దానికోసమే ఆయన నగరానికి వస్తున్నారు. దీంతో పాటు కాజీపేట వర్క్ షాప్, సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ది, సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
హై టెక్నాలజీ హంగులతో రూపొందించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను దశలవారీగా అన్ని జోన్లలో ప్రవేశపెడుతోంది మోడీ సర్కార్. కేవలం రెండు నిమిషాల్లో 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ ట్రైన్ ప్రత్యేకత. ఈ రైలు రాకతో సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది.