Advertisement
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మూవీ వీరసింహారెడ్డి. ఇప్పటికే ఈ మూవీపై అభిమానులకు భారీ అంచనాలు పెరిగాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే, జనవరి 6న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. మూవీ టీమ్ అంత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలయ్య, శృతిలతో పాటు మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ కూడా హైలైట్ గా నిలిచింది.
Advertisement
పూల డ్రెస్ లో కనిపించిన హాని అందరు చూపులు తనవైపు తిప్పుకుంది. స్టేజి మీద ‘మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయే’ పాటకు స్టెప్పులేసింది. బాలయ్య కూడా ఆమెతో మలయాళం లో మాట్లాడి కామెడీ చేశాడు. ఇదంతా చూసి, అరే, ఇంత అందంగా ఉంది, ఎవరి ముద్దుగుమ్మ? అంటూ హనీ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేసేసారు తెలుగు ఆడియన్స్. కేరళలో పుట్టి పెరిగిన 31 సంవత్సరాల హాని, 17 ఏళ్ల క్రితం అంటే 2005లో తన 14వ ఏటని నటిగా ఎంట్రీ ఇచ్చింది. మాతృభాష మలయాళం లో తొలి సినిమా చేసిన తర్వాత 2007లో తమిళంలోనూ అడుగు పెట్టింది. అదే ఏడాది ఆలయంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
Advertisement
అయితే అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది. కన్నడలోనూ నటించిన హాని ‘ఈ వర్షం సాక్షిగా’ అనే మరో మూవీ చేసిన తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఇంకో హైలెట్ ఏంటంటే హాని రోజ్ బోల్డ్ పాత్రలకు కూడా కేరాఫ్ అడ్రస్. గతేడాది రిలీజ్ అయిన ‘మాన్ స్టర్’ మూవీలో మంచు లక్ష్మితో కలిసి లిప్ లాక్ సీన్స్ చేసి షాక్ ఇచ్చింది. ఆమె వీరసింహారెడ్డిలో వీరసింహారెడ్డి భార్య మీనాక్షి రెడ్డి క్యారెక్టర్ చేస్తోందని తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ అవ్వకుండానే మంచి పాపులారిటీ తెచ్చుకుంది. సినిమా కనుక హిట్టయితే తెలుగులో మరిన్ని మంచి ఆఫర్స్ వస్తాయని ధీమాగా ఉంది హనీ రోజ్.
Read also: కమల్ టు ఎన్టీఆర్.. మొదటి సినిమాకి ఈ 10 మంది సార్లు తీసుకున్న పారితోషికాల లిస్ట్..!