Advertisement
ఈ రోజుల్లో టీనేజ్ లో ఆకర్షణలు, ప్రేమలు సర్వసాధారణమైపోయాయి. జీవితంలో ఎవరిని ప్రేమించని, ఇష్టపడని జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటే అది మాత్రం అత్యాశే. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో తనికెళ్ల భరణి గారిది ఓ డైలాగ్ ఉంటుంది. ” ఈ రోజుల్లో కేబుల్ కనెక్షన్ లేని ఇల్లు, ఎఫైర్ లేని అమ్మాయిలు దొరకడం కష్టం రా” అని. పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఉండడం సహజమే అయినప్పటికీ.. పెళ్లి అయిన తర్వాత గతాన్ని విడిచిపెట్టి భర్తతో ఎంత నిజాయితీగా, ఎంత ప్రేమగా ఉంటున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. ఎప్పుడు చూసినా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మొబైల్స్ తో బిజీగానే ఉంటున్నారు.
Advertisement
Read also: త్రిష కెరీర్ లో ఆ స్టార్ నటుడు చాలా స్పెషల్.. ఎందుకంటే..?
Advertisement
ఎప్పుడూ చాటింగ్ లేదా ఫోన్ కాల్స్ మీదనే ఉంటూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటున్నారు. అయితే ఈ జనరేషన్లో అందరూ అలా ఉన్నారని కాదు కానీ ఎక్కువ మంది యూత్ వాళ్ల సమయాన్ని లవ్ మీదనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే ఇటీవల ఇలాంటి ఘటనే హయత్ నగర్ లో చోటుచేసుకుంది. భర్తతో గొడవ పడిన ఓ మహిళా అదృశ్యమైన సంఘటన గురువారం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. హయత్ నగర్ డివిజన్ సూర్య నగర్ లో నివసించే మహేంద్ర రెడ్డి ఓ ప్రైవేటు ఉద్యోగి. ఆయన భార్య శిరీష (25).
మహేంద్ర రెడ్డి తన ఉద్యోగం ముగించుకొని బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో శిరీష గుర్తు తెలియని వారితో ఫోన్లో చాటింగ్ చేస్తుంది. ఇది గమనించిన మహేంద్ర రెడ్డి శిరీషను ప్రశ్నించాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన మహీంద్రా రెడ్డి శిరీషపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన శిరీష భర్తకు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయింది. కంగారుపడిన మహేంద్ర రెడ్డి చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో మహేంద్ర రెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read also: క్రికెటర్లకు నిర్వహించే యో యో టెస్ట్ అంటే ఏంటి ? అసలు దీన్ని ఎలా నిర్వహిస్తారో తెలుసా..?