Advertisement
ప్రేమ అన్నమాటకు సంబంధించి మనలో చాలా మనోభావం ఉంటుంది. దాని గురించి రకరకాల ఊహలు నిర్వచనాలు చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుంటే అతడే మహారాజు. ప్రేమలో మునిగిపోయిన ప్రేమికులు ఏం చేస్తారో చెప్పడం చాలా కష్టం. కొంతమంది చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోతారు. మరికొంతమంది ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏదో ఒకటి ఇచ్చుపుచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.
Advertisement
నా చిన్ననాటి స్నేహితుడతను, తెల్లారడంతోనే మొదలయ్యేవి మా ఆటలు, కలిసి పతంగులేగరేయడం, మామిడి తోటలో దొంగతనాలు చేయడం, మా ఊరి చెరువులో ఈత కొట్టడం, తను ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాల్సిందే, అలా ఉండేది మా స్నేహం! కాలంతోపాటు మా స్నేహం కూడా పెరిగి ప్రేమగా మారింది. అది కాస్త ఇంట్లో తెలిసి మా నాన్న, అన్నయ్య ఇద్దరు కలిసి నన్ను కొట్టారు. ఆ దెబ్బలకు నా బొక్కలు విరిగాయి, నోట్లోంచి రక్తం పడింది. అయినా అతనిపై నా ప్రేమ ఇంకా పెరిగింది. ఇద్దరం కలిసి ఊరు వదిలి పారిపోయాము. ఇద్దరం కలిసి ఓ పెద్ద టౌన్ లో చిన్న రూమును అద్దెకు తీసుకుని మా కొత్త జీవితాన్ని ప్రారంభించాము. అతను టెక్స్టైల్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. నేను మా ఇంటి ఏరియాలో ఉండే ఇండ్లలో పాచి పని చేసేదానిని. చిన్న ఉద్యోగాలు, చిన్న ఇల్లు, కానీ మనసు నిండా బోలెడంత ప్రేమ. ఒక్కోసారి ఆయన నైట్ డ్యూటీ కూడా చేసేవారు. ఆయన కోసం తెల్లవారే వరకు ఎదురుచూసిన రోజులు అనేకం, అయినా ఆ ఎదురు చూపుల్లో భలే ఆనందం ఉండేది.
Advertisement
ఓ రోజు, సాయంత్రం నేను ఇంట్లో ఉన్న సమయాన, మా ఆయనతో పాటు అదే టెక్స్టైల్ కంపెనీలో పనిచేసే మరో వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. “మీ ఆయన మా కంపెనీలో పనిచేసే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కంపెనీ దగ్గరే ఓ ఇల్లు రెంట్ కు తీసుకొని వాళ్ళిద్దరూ ఉంటున్నారని” చెప్పాడు. అతని మాటల్లో నిజం లేదని నాకు అనిపించింది. ఎందుకంటే మా ప్రేమ అంత స్వచ్ఛమైనది. కానీ అతను నిజం నిజం నేను చెప్పేది నిజం అంటుంటే, అతని మాటలను అబద్ధమని నిరూపించడానికి అతనితో కలిసి బయలుదేరాను. దూరంగా ఓ ఇంటిని చూపించాడు. ఇదే మీ ఆయన ఉంటున్న ఇళ్ళని చెప్పాడు అతను. కొద్దిసేపటికి మా ఆయన మరో అమ్మాయితో కలిసి నవ్వుకుంటూ ఆ ఇంట్లోకి ఓ సంచి తో వెళ్లడం చూశాను. తట్టుకోలేక పోయాను. నా కాళ్లు అక్కడ నిలబడలేకపోయాయి. ఇంటికి ఎలా వచ్చానో కూడా తెలియదు.
నా మనసును రాయి చేసుకున్నాను. మా ఆయనకు ఇష్టమైన చేపల కూర వండాను. నాకు తెలుసు ఇదే నేను మా ఆయనకు వడ్డించే చివరి భోజనం అని! ఆయన వచ్చాడు, ఎప్పటిలాగే స్నానం చేసి తినడానికి కూర్చున్నారు. నేను కూడా నాకేం తెలియదన్నట్టు వండిన అన్నం, కూర వడ్డించాను. “బాగుంది, చాలా బాగుంది అంటూ” తిన్నాడు. ఆ క్షణం ఆయన కళ్ళల్లోకి చూసి మీరు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా? అని అడిగాను. ఆయనకు అర్థమయ్యింది. ఏడవడం స్టార్ట్ చేశాడు. అప్పటికే ఏడ్చి ఏడ్చి నా కన్నిరంతా ఇంకిపోయింది. ఒంటి మీద ఉన్న ఓకే ఒక చీరతో ఆ ఇంటి నుండి బయలుదేరాను. బ్రతిమాలాడాడు. కానీ ప్రపంచంలో అత్యంత కఠినమైన విషయం ఏంటంటే, సెకండ్ ఛాన్స్ ఇవ్వడం, అది నేను ఇవ్వదలచుకోలేదు. నా దారి నేను వెతుక్కున్నాను. అలా వచ్చేసి ఇప్పటికీ 15 సంవత్సరాలు, నా బతుకేదో నేను బతుకుతున్న, నా గతం ఎవరికి చెప్పుకోకుండా, నా వాళ్ళు ఎవరూ లేరు, నేనో అనాథను అని నన్ను నేను పరిచయం చేసుకొని నా జీవనం సాగిస్తున్న!
Read also: త్రిష కెరీర్ లో ఆ స్టార్ నటుడు చాలా స్పెషల్.. ఎందుకంటే..?