Advertisement
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవి ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Advertisement
ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరు అండ్ రవితేజ ఇద్దరు హాజరయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన ఈవెంట్ కి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక ఈ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ, మూవీలోని పాత్రలు, విషయాలు లీక్ చేశాడు. సినిమా మొదలైన 25 నిమిషాల్లో రెండు సన్నివేశాలు ఉంటాయి. ఎక్కడ రాజీ పడకుండా దర్శకుడు బాబి వాటిని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించాడు. అవి ఏంటంటే అని చెప్పబోతుంటే, చిత్ర యూనిట్ ఆపేసింది. ఒక మూడ్ లో పడిపోయి సినిమా మొత్తం చెప్పేసేలా ఉన్నా, నన్ను గమనిస్తూ ఉండు బాబీ. కథ లీక్ చేస్తుంటే నన్ను ఆపు అంటూ, చిరంజీవి మళ్ళీ తన స్పీచ్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత కూడా మళ్లీ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలను లీక్ చేసేసాడు.
Advertisement
రవితేజ సెకండ్ హాఫ్ లో వస్తాడు. అతను వచ్చిన దగ్గర నుండి సినిమా ఇంకో లెవెల్ కి వెళుతుంది. మా ఇద్దరి పాత్రలు ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయి. ఇక క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశం అని చెప్పబోతుంటే దర్శకుడు బాబి ఆపేశాడు. అలాగే ఒక యాక్షన్ సన్నివేశంలో కూడా శృతిహాసన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటూ తెలియజేశాడు. కేతరిన్ పాత్ర కథని మలుపు తిప్పే పాత్ర అయితే రాజేంద్రప్రసాద్ పాత్ర ఈ కథని మొదలుపెట్టే పాత్ర అంటూ వెల్లడించాడు. రాజేంద్రప్రసాద్ అంటే కామెడీ క్యారెక్టర్ కాదు, చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్. ఒక పోలిస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు లీక్ చేశాడు. అయితే చిరు స్టోరీ లీక్ చేస్తున్న తరుణంలో అన్నయ్య అంటూ బాబీ ఆపే ప్రయత్నం చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
Read also: త్రిష కెరీర్ లో ఆ స్టార్ నటుడు చాలా స్పెషల్.. ఎందుకంటే..?